తొలి రోజు ఆట ముగించిన టీమిండియా

తొలి రోజు ఆట ముగించిన టీమిండియా

Updated On : October 19, 2019 / 12:23 PM IST

రాంచీ వేదికగా సఫారీలపై సవారీ చేస్తున్న భారత జట్టు తొలి రోజు ఆటముగించింది. మూడో టెస్టులోని తొలి రోజును ఆచితూచి ఆడుతూ నడిపించింది రోహిత్-రహానె జోడి. తొలి సెషన్ లోనే 3వికెట్లు కోల్పోయినా రోహిత్ సెంచరీకి మించిన స్కోరుతో అలరించాడు. 4సిక్సులు బాదిన హిట్ మాన్ పేరిట ప్రపంచ రికార్డు నమోదైంది. 

ఓపెనర్‌గా దిగిన మయాంక్(10)పరుగులకే వెనుదిరిగాడు. చతేశ్వర్ పూజారా డకౌట్, విరాట్ కోహ్లీ(12)పరుగులతో సరిపెట్టుకోగా పెవిలియన్ చేరాడు. అజింకా రహానె(83; 135 బంతుల్లో 11ఫోర్లు, 1సిక్సు), రోహిత్ శర్మ(164 బంతుల్లో 14ఫోర్లు, 4సిక్సులు)తో భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడ 2వికెట్లు, ఎన్రిచ్ 1వికెట్ తీయగలిగారు. 

మ్యాచ్ ఆడేందుకు సమయం ఉన్నా వాతావరణంలో మార్పులు కారణంగా వెలుతురు లోపించి మ్యాచ్‌ను నిలిపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా తొలి రోజు కేవలం 58 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. స్టంప్స్ సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేయగలిగింది. క్రీజులో రోహిత్(117), రహానె(83)తో ఉన్నారు.