క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయిన సింధు

ఇండోనేషియా రాజధాని జకర్తాలో శుక్రవారం(జనవరి 25, 2019) జరిగిన ఇండోనేషియా మాస్టర్స్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓడిపోయింది. కేవలం 37 నిమిషాల్లో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ చేతిలో 11-21, 12-21 తేడాతో సింధు ఓడిపోయింది. ఇప్పటికి వరకు 13సార్లు సింధుతో తలపడిన మారిన్ ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్ విజయంతో కలిపి 8 విజయాలను తన ఖాతాలో వేసుకొంది. మారినాతో తలపడిన 13సార్లలో కేవలం 5సార్లే సింధు విజయం సాధించింది. మరో వైపు ఇదే టోర్నమెంట్ లో క్వార్టర్ ఫైనల్ లో విజయం సాధించి సైనా నెహ్వాల్ సెమిస్ లోకి అడుగుపెట్టగా కిదాంబి శ్రీకాంత్ మాత్రం క్వార్ట్ ర్ ఫైనల్ లో ఓడిపోవడంతో వెనుదిరిగాడు.