IPL 2019: బెంగళూరు ప్లేఆఫ్‌కు వెళ్లగలదు

2019 సంవత్సరానికి గానూ ఆరంభమైన ఐపీఎల్ సీజన్ 12లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాభవాన్ని నెత్తినేసుకుంది.

IPL 2019: బెంగళూరు ప్లేఆఫ్‌కు వెళ్లగలదు

Updated On : April 13, 2019 / 11:23 AM IST

2019 సంవత్సరానికి గానూ ఆరంభమైన ఐపీఎల్ సీజన్ 12లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాభవాన్ని నెత్తినేసుకుంది.

2019 సంవత్సరానికి గానూ ఆరంభమైన ఐపీఎల్ సీజన్ 12లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాభవాన్ని నెత్తినేసుకుంది. వరుస తప్పిదాలతో ఆడిన 6మ్యాచ్‌లలోనూ పరాజయంతో లీగ్ పట్టికలో ఆఖరి స్థానానికి చేరింది. అయినప్పటికీ తమ జట్టు ప్లేఆఫ్‌కు ఛేరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు బెంగళూరు స్సిన్నర్ యజ్వేంద్ర చాహల్. 
Read Also : RRvMI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

‘మా జట్టులో మంచి పెర్‌ఫార్మర్లు ఉన్నారు. అయినప్పటికీ ఓటములను ఎదుర్కొంటున్నాం. బ్యాటింగ్.. బౌలింగ్.. ఇలా ఎవర్నీ కించపరచాలనుకోవడం లేదు. జట్టుగా కష్టపడలేకపోతున్నాం. వ్యక్తిగతంగా కాకుండా జట్టు సహకారంతో పారాడితే మ్యాచ్ గెలవగలం. దాంతో పాటు డెత్ ఓవర్లలో బౌలింగ్ పైనా దృష్టి పెట్టాలి. 16 ఓవర్ల వరకూ బాగా బౌలింగ్ చేసి ఫినిషింగ్ సరిగా ఇవ్వలేకపోతున్నాం’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ వెల్లడించాడు. 

ఏప్రిల్ 13న పంజాబ్ వేదికగా లీగ్‌లో తొలి సారి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఢీకొట్టబోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటి విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. 2019 ఐపీఎల్‌లో 28వ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోన్న ఇరు జట్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ .. ఏడింటికి 4 మ్యాచ్‌లు గెలవగా బెంగళూరు జట్టుకు ఇది ఆరో మ్యాచ్. 
Read Also : ప్రతిష్ఠాత్మక టోర్నీ నుంచి పీవీ సింధు ఔట్