IPL 2023 Playoff: ఢిల్లీ ఔట్.. ఆర్‌సీబీ, హైదరాబాద్ డౌట్.. ప్లే ఆఫ్స్‌కు చేరే ఆ నాలుగు జట్లు ఏవంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్ తుది దశకు చేరుకుంది. దాదాపుగా అన్ని జట్లు 11 మ్యాచ్‌లు ఆడేశాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోలేదు.

IPL 2023 Playoff Qualification Scenarios ( pic IPL Twitter)
IPL 2023 Playoff: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్ తుది దశకు చేరుకుంది. దాదాపుగా అన్ని జట్లు 11 మ్యాచ్‌లు ఆడేశాయి. ప్రతీ జట్టు మూడు మ్యాచులు మాత్రమే ఆడాల్సి ఉంది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోలేదు. టెక్నికల్‌గా అన్ని జట్లు రేసులో ఉన్నప్పటికీ చెన్నై మ్యాచ్‌లో ఓడిపోవడం ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది.
గుజరాత్ టైటాన్స్ : హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్ ఈ సీజన్‌లోనూ దూసుకుపోతుంది. 11 మ్యాచులు ఆడగా 8 మ్యాచుల్లో విజయం సాధించింది. 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఇంకో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచుల్లో ఓడినప్పటికీ కూడా గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్తుకు వచ్చిన నష్టం లేదు. అయితే.. టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటాది అన్న సంగతి తెలిసిందే. దీంతో గుజరాత్ టాప్ ప్లేస్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తుంది అనడంలో సందేహం లేదు.
చెన్నై సూపర్ కింగ్స్ : ధోని నాయకత్వంలోని చెన్నై జట్టు 12 మ్యాచులు ఆడగా 7 మ్యాచుల్లో గెలుపొందింది. 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో కనీసం ఒక్క మ్యాచులో విజయం సాధించినా ఎలాంటి సమీకరణాలు లేకుండా చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.
ముంబై ఇండియన్స్: రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఆరంభంలో వరుస ఓటములను చవిచూసింది. అయితే.. రెండో అర్ధభాగంలో కోలుకుంది. 11 మ్యాచులు ఆడగా 6 మ్యాచుల్లో గెలిచి 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇంకో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలో గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ రెండు మ్యాచుల్లో గెలిస్తే మాత్రం భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముంబై నెట్‌రన్‌రేట్ -0.255గా ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ : ఈ సీజన్‌లో లక్నో పరిస్థితి ఓ విజయం ఓ ఓటమిగా ఉంది. 11 మ్యాచులు ఆడగా ఐదు మ్యాచుల్లో గెలువగా, ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు ఈజీగా ప్లే ఆఫ్స్‌కు వెలుతుంది. ఒకవేళ ఒక్క మ్యాచులో ఓడినా ఇతర జట్ల సమీకరణాలు బట్టి లక్నోకు అవకాశాలు ఉంటాయి.
రాజస్థాన్ రాయల్స్ : ఆరంభంలో విజయాలతో మురిపించిన రాజస్థాన్ ఇప్పుడు వరుసగా ఓడిపోతుంది. చివరి ఆరు మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో ఓడింది. మొత్తంగా 11 మ్యాచ్‌లు ఆడగా ఐదు విజయాలు మాత్రమే సాధించి 10 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచులో ఓడినా ఇతర జట్ల ఫలితాల బట్టి రాజస్థాన్‌కు అవకాశాలు ఉంటాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్: నితీశ్ రాణా కెప్టెన్సీలోని కోల్‌కతా గత రెండు మ్యాచుల్లో గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 11 మ్యాచులు ఆడగా ఐదు విజయాలతో 10 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచుల్లో రాజస్థాన్, చెన్నై, లక్నో వంటి బలమైన జట్లతో ఆడాల్సి ఉంది. అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్‌కు అవకాశాలు ఉంటాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : సీజన్ ప్రారంభమైన ప్రతీసారి కప్పు మనదే అని అనడం ఆ తరువాత ఊసురు మనిపించడం బెంగళూరుకు అలవాటుగా మారింది. ఈ సారి దాదాపు అదే పరిస్థితి ఉంది. 11 మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించి 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచులు రాజస్థాన్, హైదరాబాద్, గుజరాత్‌తో ఆడాల్సి ఉంది.
పంజాబ్ కింగ్స్: 11 మ్యాచులు ఆడిన పంజాబ్ 5 విజయాలు సాధించింది. 10 పాయింట్లతో 8 స్థానంలో ఉంది. ఢిల్లీతో రెండు, రాజస్థాన్‌తో ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లో కనీసం రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్: మార్‌క్రమ్ కెప్టెన్సీలోనూ సన్‌రైజర్స్ రాత మారలేదు. 10 మ్యాచుల్లో నాలుగు గెలిచింది. 8 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇంకో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. లక్నో, గుజరాత్, బెంగళూరు, ముంబైతో జరగనున్న మ్యాచుల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ : వరుసగా ఐదు ఓటములతో సీజన్‌ను ఆరంభించిన ఢిల్లీ ఆ తరువాత ఆరు మ్యాచుల్లో నాలుగు గెలిచింది. అయితే.. మొత్తంగా 11 మ్యాచుల్లో నాలుగు మాత్రమే గెలిచి 8 పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచుల్లో విజయాలు సాధించిన ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరుకోవడం అసాధ్యం.