Kavya Maran : కావ్య పాపకు కోపమొచ్చింది.. ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ ఈజీ క్యాచ్ మిస్ చేయగానే ఎలా అరిచిందో చూడండి.. వీడియో వైరల్..
శుక్రవారం చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ నవరసాలు పలికించింది.

IPL 2025 CSK vs SRH Kavya Maran Loses Her Cool As Harshal Patel Drops catch
సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌కు ఉన్న ఫాన్ ఫాలోంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మ్యాచ్ సమయంలో ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ కోసమే చాలా మంది మ్యాచ్‌ను చూస్తుంటారు. ఆమె పలికే హవభావాలు సోషల్ మీడియాలో ఎన్నో సార్లు వైరల్‌గా మారిన సందర్భాలు ఉన్నాయి. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కావ్య పాప నవరసాలు పలికించింది.
ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు వికెట్లు తీసినప్పుడు, బౌండరీలు కొట్టినప్పుడు, క్యాచ్‌లు వదిలివేసినప్పుడు, బ్యాటర్లు షాట్ల ఆడేందుకు ఇబ్బంది పడినప్పుడు కావ్య ఇచ్చిన రియాక్షన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మీమర్స్ ఊరుకుంటారా చెప్పండి ఫన్నీ కామెంట్స్‌తో మీమ్స్ ట్రెండ్ చేసి నవ్వులు పూయిస్తున్నారు.
కావ్యకు కోపమొచ్చింది..
రవీంద్ర జడేజా ఇచ్చిన సులువైన క్యాచ్‌ను హర్షల్ పటేల్ వదిలివేయడంతో కావ్య మారన్‌కు కోపమొచ్చింది. స్టాంప్స్‌లో కూర్చున్న ఆమె.. హర్షల్ పటేల్ పై అరిచినట్లుగా కనిపించింది.
Kavya Maran🤬😭🤣 https://t.co/tXzBsgUxvu pic.twitter.com/AXI1jCtFNu
— Salvatore Di Vita🎥🖤 (@Melancholic__AF) April 25, 2025
చెన్నై ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను జీషన్ అన్సారీ వేశాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతికి జడేజా భారీ షాట్ కొట్టాడు. అయితే.. బంతి టైమింగ్ మిస్ కావడంతో లాంగ్ ఆఫ్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హర్షల్ పటేల్ ఈజీగా క్యాచ్ అందుకుంటాడని అంతా భావించారు. అయితే.. ఈజీ క్యాచ్‌ను హర్షల్ పటేల్ జారవిడిచాడు.
దీంతో స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను చూస్తున్న కావ్యాకు కోపమొచ్చింది. హర్షల్ ను తిట్టినట్లుగా కనిపించింది. కీలక వికెట్ తీసే అవకాశం మిస్ కావడంతో ఆ ప్రస్టేషన్ ఆమె ముఖంలో స్పష్టం గా కనిపిచింది. అప్పుడు జడేజా 8 పరుగుల ఆడుతున్నాడు. చివరి జడేజా 17 బంతుల్లో 21 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
వాటే ఏ క్యాచ్..
ఆ తరువాత కమిందు మెండీస్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నప్పుడు వారెవ్వా వాటే క్యాచ్ అంటూ కావ్య పాప రియాక్షన్ ఇచ్చింది.
హర్షల్ బౌలింగ్ లో ఓ స్లో బంతిని బ్రెవిస్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ లో ఉన్న కమిందు మెండిస్ వేగంగా దూసుకొచ్చి గోల్‌కీపర్ బంతిని అందుకునే తరహాలో 11.09 మీటర్ల దూరం పరిగెత్తి తన ఎడమవైపునకు సమాంతరంగా డైవ్ చేస్తూ ఆ క్యాచ్‌ను పట్టేయడం హైలైట్‌గా నిలిచింది.
SRH owner Kavya Maran’s REACTIONS to Kamindu Mendis’ STUNNING CATCH! 🤯🔥#KavyaMaran #KaminduMendis #CatchOfTheSeason #IPL2025 #WhistlePodu #CricketMagic pic.twitter.com/ekUAnu0zcF
— Akaran.A (@Akaran_1) April 25, 2025
KAMINDU MENDIS WITH AN OUTRAGEOUS CATCH IN IPL 2025. 🤯pic.twitter.com/ukDlq24jQl
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2025