IPL 2025: ఉత్కంఠపోరులో బెంగళూరుదే గెలుపు.. 2పరుగుల తేడాతో చెన్నైపై విజయం.. టేబుల్ టాపర్‌గా RCB

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

IPL 2025: ఉత్కంఠపోరులో బెంగళూరుదే గెలుపు.. 2పరుగుల తేడాతో చెన్నైపై విజయం.. టేబుల్ టాపర్‌గా RCB

Courtesy BCCI

Updated On : May 3, 2025 / 11:36 PM IST

IPL 2025: ఉత్కంఠపోరులో చెన్నై సూపర్ కింగ్స్ పై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ గెలుపొందింది. 2 పరుగుల స్వల్ప తేడాతో చెన్నైపై విక్టరీ కొట్టింది. 214 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సీఎస్ కే.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 రన్స్ కే పరిమితమైంది. చివరి ఓవర్ లో విజయానికి 15 పరుగులు కావాల్సి ఉండగా.. 13 పరుగులే వచ్చాయి. ఫలితంగా 2 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా చెలరేగిపోయారు. ఓ దశలో సీఎస్ కే గెలుపు దిశగా సాగింది. విజయం మాత్రం అందుకోలేకపోయింది.

Also Read: గుజరాత్‌ టైటాన్స్‌ తనను ఎందుకు వెళ్లగొట్టిందో చెప్పిన రబాడ.. బుద్ధొచ్చింది.. ఇంకెప్పుడూ అలా చేయను..

మాత్రే 48 బంతుల్లో 94 పరుగులు చేశాడు. 5 సిక్సులు, 9 ఫోర్లు కొట్టాడు. జడేజా 45 బంతుల్లో 77 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 2 సిక్సులు, 8 ఫోర్లు కొట్టాడు. చివరి వరకు క్రీజులో ఉన్నా జట్టుకి విజయాన్ని అందించలేకపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఈ గెలుపుతో పాయింట్ల టేబుల్ లో ఆర్సీబీ 3వ స్థానం నుంచి టాప్ లోకి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ అట్టడగు పొజిషిన్ లో ఉంది.