MS Dhoni: ధోనీ వేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు తీర్పు

ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌ విషయంలో తనపై నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ విచారణ అధికారి సంపత్ కుమార్‌పై ధోనీ అప్పట్లో పరువు నష్టం దావా వేశారు.

MS Dhoni: ధోనీ వేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు తీర్పు

MS Dhoni

Updated On : December 15, 2023 / 5:53 PM IST

Madras high court: ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్‌కు మద్రాస్ హైకోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించింది. టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ వేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

అయితే, ఆ వెంటనే ఈ తీర్పును 30 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ.. సంపత్ కుమార్ అప్పీల్ చేసుకునేందుకు డివిజన్ బెంచ్ జస్టిస్ ఎస్ఎస్ సుందర్, జస్టిస్ సుందర్ మోహన్ అవకాశం ఇచ్చారు. ఐపీఎల్-2013 బెట్టింగ్ స్కామ్‌ విషయంలో తనపై నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ విచారణ అధికారి సంపత్ కుమార్‌పై ధోనీ అప్పట్లో పరువు నష్టం దావా వేశారు.

దానిపై సంపత్ కుమార్ 2021 డిసెంబరు 17న లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు. దానిపై ధోనీ సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత సంపత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ధోనీ మళ్లీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు, హైకోర్టుకు వ్యతిరేకంగా సంపత్ కుమార్ పలు కామెంట్స్ చేశారని ధోనీ కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. దీనిపైనే మద్రాస్ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌ అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే.

WI vs ENG 2nd T20 : సిక్స్ ఇలా కొట్టాల‌ని ఇన్ని రోజులు తెలియ‌దు భ‌య్యా..! వీడియో వైర‌ల్‌