IPL2023 GT Vs DC : చెలరేగిన సాయి సుదర్శన్, ఢిల్లీపై గుజరాత్ విజయం
IPL2023 GT Vs DC : 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టుపై గుజరాత్ టైటాన్స్ విక్టరీ కొట్టింది. 163 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు ధాటిగా ఆడారు.

Ipl 2023 Match No 7
IPL2023 GT Vs DC : ఐపీఎల్ 2023 సీజన్-16లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ గర్జించింది. ఢిల్లీపై విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టుపై గుజరాత్ టైటాన్స్ విక్టరీ కొట్టింది. 163 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు ధాటిగా ఆడారు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 48 బంతుల్లో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు.
ఇక, డేవిడ్ మిల్లర్ 31*, విజయ్ శంకర్ 29, సాహా 14, గిల్ 14 పరుగులతో రాణించారు. దీంతో గుజరాత్ జట్టు 18.1ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మరో 11 బంతులు మిగిలి ఉండగానే విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.(IPL2023 GT Vs DC)
Also Read..IPL 2023: తీవ్రగాయంతో ఐపీఎల్ నుంచి వైదొలిగిన మరో ప్లేయర్
డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు ఈ సీజన్ లో ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. గుజరాత్ జట్టులో యువ బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. ఒంటి చేత్తో జట్టుని విజయతీరాలకు చేర్చాడు. సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 31 పరుగులు చేసి టైటాన్స్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆల్ రౌండర్ విజయ్ శంకర్ 29 పరుగులతో రాణించాడు.
ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (14), శుభ్ మాన్ గిల్ (14), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (5) స్వల్ప స్కోర్లకే ఔటైనా.. గుజరాత్ టైటాన్స్ నెగ్గిందంటే అది సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ వల్లే. లక్ష్యఛేదనలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా సుదర్శన్ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఆన్రిచ్ నోర్జే 2 వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ చెరో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. తడబడుతూనే బ్యాటింగ్ చేసిన కెప్టెన్ వార్నర్ 37 పరుగులు చేశాడు. ఓపెనర్ పృథ్వీ షా (7), ఆల్ రౌండ్ మిచెల్ మార్ష్ (4), రిలీ రూసో (0) విఫలమయ్యారు.
సర్ఫరాజ్ ఖాన్ 30, అభిషేక్ పోరెల్ 20 పరుగులు చేయగా, ఆఖర్లో అక్షర్ పటేల్ దూకుడుగా ఆడడంతో ఢిల్లీ స్కోరు 150 మార్కు దాటింది. అక్షర్ పటేల్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ పోరెల్ 2 సిక్సులు బాదాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ తలో 3 వికెట్లు పడగొట్టారు. అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీశాడు.(IPL2023 GT Vs DC)
ఈ సీజన్ లో ఢిల్లీ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలోనూ ఢిల్లీ ఓటమిపాలైంది. ఆడిన రెండు మ్యాచుల్లో రెండు వరుస విజయాలతో గుజరాత్ జట్టు పాయింట్ల టేబుల్ లో టాప్ పొజిషన్ లో ఉంది.