Jasprit Bumrah : జస్‌ప్రీత్ బుమ్రా ట్రిబ్యూట్ వీడియో.. కోహ్లీ ఆడియోతో.. గూస్‌బంప్స్..
తాజాగా బుమ్రా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

Jasprit Bumrah Tribute Video With Kohli Audio Goosebumps
Jasprit Bumrah Tribute Video : బార్బడోస్ వేదికగా జూన్ 29న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాప్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి భారత జట్టు విశ్వ విజేతగా నిలిచింది. 17 ఏళ్ల తరువాత టీ20 ప్రపంచకప్‌ను మరోసారి ముద్దాడింది. ప్రస్తుతం టీమ్ఇండియా ఆటగాళ్లంతా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. టీమ్ఇండియా ప్రపంచకప్ ను సాధించడంలో పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన వంతు పాత్ర పోషించాడు. ఈ పొట్టి ప్రపంచకప్‌లో 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును అందుకున్నాడు.
కాగా.. తాజాగా బుమ్రా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో కింద ఇలా రాసుకొచ్చాడు. గత కొన్ని రోజులుగా తాను కలలో జీవిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇది ఆనందం, కృతజ్ఞతతో నిండి ఉంది అని బుమ్రా అన్నాడు. ఇక ఆ వీడియోలో విజయోత్సవ పరేడ్‌లోని దృశ్యాలతో పాటు వాంఖడే స్టేడియంలోని మూవెంట్స్ ఉన్నాయి. వాంఖడేలో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాట్లాడిన మాటలు ఆ వీడియోకి వాయిస్ ఓవర్‌గా ఉంది.
టీమ్ఇండియా ప్రపంచకప్‌ను సాధించి స్వదేశానికి వచ్చిన సందర్భంగా బీసీసీఐ ఆటగాళ్లను వాంఖడే స్టేడియంలో సన్మానించింది. ఈ సందర్భంగా బుమ్రా పై కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక్కడ ఉన్న అభిమానుల్లాగే తాను కూడా ఫైనల్ మ్యాచ్ లో ఓ సమయంలో మళ్లీ ప్రపంచకప్‌ను కోల్పోతున్నామా అనే భావన కలిగింది. అయితే.. ఆఖరి ఐదు ఓవర్లలో బుమ్రా అద్భుతమే చేశాడు.
ఇందులో బుమ్రా వేసిన రెండు ఓవర్లు ఎంతో కీలకమైనవి. అతడు జట్టును మళ్లీ పోటీలోకి తెచ్చాడు. ఇలా ఎన్నో సార్లు బుమ్రా భారత్‌కు విజయాన్ని అందించాడు. జనరేషన్‌కు ఇలాంటి బౌలర్ ఒక్కడే ఉంటాడు. అతను ప్రపంచంలోనే ఎనిమిదో అద్భుతం అని కోహ్లీ అన్నారు.
మూడో టీ20 మ్యాచ్‌కు ముందు కెప్టెన్ గిల్, కోచ్ లక్ష్మణ్‌లకు తలనొప్పి.. జట్టులో ఎవరుంటారో..?
I am so thankful for the last few days. I’ve been living a dream and it has filled me with happiness and gratitude.??? pic.twitter.com/w5LTukO9Fz
— Jasprit Bumrah (@Jaspritbumrah93) July 8, 2024