Neeraj Chopra: అభిమాని కాళ్లు పట్టుకున్న నీరజ్ చోప్రా

దేశం గర్వించేలా నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్లలో విజయాలను కైవసం చేసుకుంటూ పతకాలు సాధిస్తోన్న నీరజ్ చోప్రా చేసిన పనికి నెట్టింట మరోసారి హీరో అయ్యాడు. అత్యంత విధేయత కలిగిన వ్యక్తిగా నిరూపించుకున్నాడు. స్టాక్ హామ్ డైమండ్ లీగ్ లో భాగంగా ఒక నెలలో రెండో సారి ఫీట్ సాధించాడు.

Neeraj Chopra: అభిమాని కాళ్లు పట్టుకున్న నీరజ్ చోప్రా

Neeraj Chopra

Updated On : July 2, 2022 / 9:33 AM IST

 

 

Neeraj Chopra: దేశం గర్వించేలా నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్లలో విజయాలను కైవసం చేసుకుంటూ పతకాలు సాధిస్తోన్న నీరజ్ చోప్రా చేసిన పనికి నెట్టింట మరోసారి హీరో అయ్యాడు. అత్యంత విధేయత కలిగిన వ్యక్తిగా నిరూపించుకున్నాడు. స్టాక్ హామ్ డైమండ్ లీగ్ లో భాగంగా ఒక నెలలో రెండో సారి ఫీట్ సాధించాడు.

రీసెంట్ గా సీనియర్ సిటిజన్ అయిన అభిమాని కాళ్లకు నమస్కరించిన నీరజ్ చోప్రా వీడియో వైరల్ అయింది. వీడియో లక్ష మందికి పైగా వీక్షించారు.

స్టాక్ హామ్ లోని అభిమానులకు ఫొటోలు దిగేందుకు అనుమతిస్తున్న నీరజ్.. ఓ పెద్ద వయసున్న అభిమాని వెళ్లిపోతుండగా కాళ్లకు నమస్కరించాడు. ఆ వీడియోలో ఒకరు నిగర్వి అంటూ అరుస్తున్నట్లు కూడా వినిపిస్తుంది.

Read Also: నీరజ్ చోప్రాకు మళ్లీ గోల్డ్ మెడల్

అతనే కాదు వేలాది మంది నెటిజన్లు సైతం వీడియో చూసి అదే రకమైన స్పందన చూపిస్తున్నారు.

నీరజ్ చోప్రా నాలుగు సంవత్సరాల తర్వాత డైమండ్ లీగ్‌కి రీ ఎంట్రీ ఇచ్చాడు. గురువారం స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల త్రోతో 2వ స్థానంలో నిలిచాడు.