Virat Kohli: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లీ, బుమ్రా దూరం
వెస్టిండీస్‌తో త్వరలో ప్రారంభం కానున్న ఐదో మ్యాచుల టీ20 సిరీస్‌కు ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ నేడు జట్టును ప్రకటించింది. ఇందులో విరాట్ కోహ్లీ, బుమ్రా పేర్లు లేవు. కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్‌కు జట్టులో చోటు దక్కింది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్ ఆడనుంది.

Kohli Burma
Virat Kohli: వెస్టిండీస్‌తో త్వరలో ప్రారంభం కానున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కు ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ నేడు జట్టును ప్రకటించింది. ఇందులో విరాట్ కోహ్లీ, బుమ్రా పేర్లు లేవు. కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్‌కు జట్టులో చోటు దక్కింది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్ ఆడనుంది. స్వాడ్‌లో కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ ఉన్నప్పటికీ వారి ఫిట్‌నెస్‌ను బట్టి తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. అంతకు ముందు వెస్టిండీస్, భారత్ మూడు వన్డే మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ నెల 22, 24, 27న వన్డే మ్యాచులు జరుగుతాయి.
Maharashtra: పెట్రోల్‌పై లీటరుకు రూ.5 వ్యాట్ తగ్గించిన మహారాష్ట్ర కొత్త సీఎం షిండే
టీమిండియా (టీ20): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాంత్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హూడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.