ODI World Cup 2023 Tickets: ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‍‌లకు టికెట్ల ధరలు వచ్చేశాయ్.. రెండు మ్యాచ్‌లకు అధిక రేట్లు

ప్రపంచ కప్ 2023లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్‌లకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) టికెట్ల ధరలను ప్రకటించింది.

ODI World Cup 2023 Tickets: ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‍‌లకు టికెట్ల ధరలు వచ్చేశాయ్.. రెండు మ్యాచ్‌లకు అధిక రేట్లు

Eden Gardens

Updated On : July 11, 2023 / 2:26 PM IST

ODI World Cup 2023: ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్‌కప్ – 2023 మెగా టోర్నీ భారత్ వేదికగా జరగనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. భారత్‌లో మొత్తం పది మైదానాల్లో ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మైదానాల్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఒకటి. ఇక్కడ లీగ్, సెమీఫైనల్ -2 మ్యాచ్‌తో కలిపి ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మైదానంలో జరిగే మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్ ప్రియులు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ గ్రౌండ్‌లో టికెట్ల ధరలు ఎలా ఉంటాయనేదానిపై అయోమయం నెలకొంది. మంగళవారం ఈ విషయంపై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) స్పష్టం ఇచ్చింది.

ICC ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌పై గంగూలీ కీలక వ్యాఖ్యలు.. సెమీస్‌కు చేరే జట్లు అవేనట..

ప్రపంచ కప్ 2023లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్‌లకు ధరలు రూ. 650 నుంచి రూ. 3వేల వరకు ఉన్నాయి. భారత్ – దక్షిణాఫ్రికా మ్యాచ్, సెమీస్‌కు ఒకే రకమైన ధరలను నిర్ణయించగా, మిగతా మూడు మ్యాచ్‌లకు వేరువేరు ధరలతో టికెట్లను క్యాబ్ విక్రయించనుంది. ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్‌లో 63,500 మంది మ్యాచ్‌ను వీక్షించొచ్చు.

మ్యాచ్‌ల వారిగా టికెట్ ధరలు ఇలా..

బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్‌కు..
అప్పర్ టైర్స్ రూ. 650, డీ, హెచ్ బ్లాక్‌లకు రూ. వెయ్యి, బీ, సీ, కే, ఎల్ బ్లాక్‌లకు రూ. 1,500.

ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు..
అప్పర్ టైర్స్ రూ. 800, డీ,హెచ్ బ్లాక్ లు రూ. 1200, సీ,కె, బ్లాక్‌లు రూ. 2000, బి, ఎల్ బ్లాక్‌లు రూ. 2,200.

బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌కు..
అప్పర్ టైర్స్ రూ. 800, డీ,హెచ్ బ్లాక్‌లు రూ. 1200, సీ,కె బ్లాక్‌లు రూ. 2000, బీ,ఎల్ బ్లాక్‌లు రూ.2200.

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌కు ..
అప్పర్ టైర్స్ రూ. 900, డీ,హెచ్ బ్లాక్‌లు రూ. 1500, సీ,కె బ్లాక్‌లు రూ. 2,500, బీ,ఎల్ బ్లాక్‌లు రూ. 3వేలు .

సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల టికెట్ ధరలు..
అప్పర్ టైర్స్ రూ. 900, డీ, హెచ్ బ్లాక్‌లు రూ. 1500, సీ, కె బ్లాక్ లు రూ. 2,500, బీ,ఎల్ బ్లాక్ లు రూ. 3వేలు.