ఆర్బీబీ పతనమయ్యేలా చేసిన హైదరాబాద్ ప్లేయర్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ పతనానికి కోల్ కతా హిట్టర్ రస్సెల్ మాత్రమే కాదు.

ఆర్బీబీ పతనమయ్యేలా చేసిన హైదరాబాద్ ప్లేయర్

Updated On : April 6, 2019 / 8:24 AM IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ పతనానికి కోల్ కతా హిట్టర్ రస్సెల్ మాత్రమే కాదు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ పతనానికి కోల్ కతా హిట్టర్ రస్సెల్ మాత్రమే కాదు. తన జట్టు ఓటమికి తానే కారణమయ్యాడు హైదరాబాదీ ప్లేయర్ మొహమ్మద్ సిరాజ్. జట్టును గెలిపించాలనే భారీ పట్టుదలతో బరిలోకి దిగిన బెంగళూరు 205 పరుగుల భారీ టార్గెట్ ను కోల్ కతా ముందుంచినా బెంగళూరు ప్లేయర్ సిరాజ్ చేజాతులారా మ్యాచ్ ను నాశనం చేశాడు. 

ఫీల్డింగ్‌లో 2 క్యాచ్‌లు వదిలేసిన సిరాజ్.. పేలవ బౌలింగ్‌తో రస్సెల్ పరుగులు చేసేలా తోడ్పడ్డాడు. 206 పరుగుల లక్ష్యఛేదనలో 17 ఓవర్లు ముగిసే సమయానికి కోల్‌కతా 153/5తో నిలిచింది. అప్పటికి క్రీజులో ఆండ్రీ రసెల్ 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేశాడు. విజయానికి కోల్‌కతా 18 బంతుల్లో 53 పరుగులు చేయాల్సి ఉంది. టార్గెట్ బహుదూరంగా ఉండటం బెంగళూరు విజయం ఖాయమనుకున్నారంతా. 
Read Also : తెలివి వాడితే బాగుండేది: బౌలర్లపై కోహ్లీ స్పందన

కానీ, ఆ ఓవర్‌లోని తొలి 2 బంతులకీ పరుగు ఇవ్వని సిరాజ్.. ఆ తర్వాత మూడో బంతి నుంచి మొదలైంది పతనం. దీంతో.. ఆ బంతి రసెల్‌ తలమీదుగా వెళ్లగా.. లెగ్ అంపైర్‌ వైడ్‌గా ప్రకటిస్తూనే.. నో బాల్ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. కానీ.. తర్వాత బంతికి పట్టుకోల్పోయిన సిరాజ్.. ఏకంగా హై ఫుల్‌టాస్‌ని విసిరేశాడు. దీంతో.. ఆ బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించగా.. తల ఎత్తులో వచ్చిన బంతిని రసెల్‌.. స్టాండ్స్‌లోకి పంపించాడు. అప్పటికే ఆ ఓవర్‌లో 2 బీమర్లు సంధించి ఉండటంతో అంపైర్.. సిరాజ‌్‌ను బౌలింగ్‌ నుంచి తప్పించాడు. 

స్టాయినిస్‌తో కెప్టెన్ కోహ్లీ బౌలింగ్ చేయించగా.. మొత్తంగా.. ఆ ఓవర్‌లో 0, 0, Wd, 6Nb, 6 ,6 ,Wd, 1, 1 రూపంలో 23 పరుగులొచ్చాయి.  ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన టిమ్ సౌథీ బౌలింగ్‌లో రసెల్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రసెల్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఫీల్డింగ్‌‌లో క్రిస్‌లిన్ క్యాచ్‌ని జారవిడచడంతో పాటు పేలవ బౌలింగ్‌తో నిరాశపరిచిన సిరాజ్‌.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 
Read Also : నా ముందు ఏ గ్రౌండ్ అయినా చిన్నదే..