రైనాను ఆపేసిన పంత్: ధోనీతో ఇలా చేయొద్దంటూ నెటిజన్ల వార్నింగ్

ఓవర్ల మధ్యలో బ్రేక్ రావడంతో కీపింగ్ స్థానంలో ఉన్న పంత్.. బ్యాటింగ్‌కు వస్తున్న రైనాను ఆపేశాడు. ఈలోపు టీవీ కెమెరాలు ఆన్ అవడంతో దారికి అడ్డుగా నిల్చొని అటుఇటూ కదలనీకుండా చేసి....

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 01:03 PM IST
రైనాను ఆపేసిన పంత్: ధోనీతో ఇలా చేయొద్దంటూ నెటిజన్ల వార్నింగ్

Updated On : May 2, 2019 / 1:03 PM IST

ఓవర్ల మధ్యలో బ్రేక్ రావడంతో కీపింగ్ స్థానంలో ఉన్న పంత్.. బ్యాటింగ్‌కు వస్తున్న రైనాను ఆపేశాడు. ఈలోపు టీవీ కెమెరాలు ఆన్ అవడంతో దారికి అడ్డుగా నిల్చొని అటుఇటూ కదలనీకుండా చేసి….

స్టేడియంలో సరదాగా ఆటపట్టిస్తాడని రిషబ్ పంత్ ఇప్పటికే ఓ ప్రింట్ వేయించేసుకున్నాడు. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో దూకుడైన బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా పేరుగాంచిన పంత్.. రైనాను బ్యాటింగ్‌కు వెళ్లనీకుండా ఆపేశాడు. చెన్నైకు ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంత్.. విన్యాసాలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 

ఓవర్ల మధ్యలో బ్రేక్ రావడంతో కీపింగ్ స్థానంలో ఉన్న పంత్.. బ్యాటింగ్‌కు వస్తున్న రైనాను ఆపేశాడు. ఈలోపు టీవీ కెమెరాలు ఆన్ అవడంతో దారికి అడ్డుగా నిల్చొని అటుఇటూ కదలనీకుండా చేసిన వీడియో అంతా చూసి నవ్వుకున్నారు. ఈ వీడియోను ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది. 

దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర స్పందన వస్తుందగా కొందరేమో.. ‘పంత్ దగ్గర ట్రై చేశావేమో.. కానీ, ధోనీతో ఇలా ప్రయత్నించకు’ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. చిదంబరం స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ 80పరుగుల తేడాతో చెన్నై చేతిలో చిత్తుగా ఓటమికి గురైంది.