RRvsKKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా

RRvsKKR:  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా

Updated On : April 7, 2019 / 1:59 PM IST

రెండో విజయం కోసం ఆరాటపడుతోన్న రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డపై రాజస్థాన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న నైట్ రైడర్స్ ను ఓడించి రెండో విజయం నమోదు చేయాలంటే రాజస్థాన్ కు కష్టతరమే. మరో వైపు అదే ఫామ్ ను కొనసాగించి రాజస్థాన్ ను చిత్తు చేయడం నైట్ రైడర్స్ కు సులభం.

ఈ పరిస్థితుల్లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠలో అభిమానులు కనిపిస్తున్నారు. కోల్ కతాలో ఒక మార్పు చోటు చేసుకోగా, రాజస్థాన్ లో 2 మార్పులు చోటు చేసుకున్నాయి. 

కోల్ కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ.. మైదానం 140కి మించిన స్కోరు చేసేంత సహకరించేటట్లు కనిపిస్తోంది. జట్టులో ఫెర్గ్యూసన్ కు బదులు హ్యారీ గుర్నేను తీసుకుంటున్నామని తెలిపాడు. రాజస్థాన్ కెప్టెన్ రహానె మాట్లాడుతూ.. స్టువర్ట్ బిన్నీ.. ఆరోన్ బదులుగా ప్రశాంత్ చోప్రా, మిధున్ లతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించాడు.

Teams:

Rajasthan Royals (Playing XI): Ajinkya Rahane(c), Jos Buttler(w), Steven Smith, Rahul Tripathi, Ben Stokes, Prashant Chopra, Krishnappa Gowtham, Jofra Archer, Shreyas Gopal, Dhawal Kulkarni, Sudhesan Midhun

Kolkata Knight Riders (Playing XI): Chris Lynn, Sunil Narine, Robin Uthappa, Nitish Rana, Dinesh Karthik(w/c), Shubman Gill, Andre Russell, Piyush Chawla, Kuldeep Yadav, Harry Gurney, Prasidh Krishna