బీసీసీఐకి గంగూలీ రాజీనామా.. ?
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐలో తాను నిర్వహిస్తోన్న కీలక పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐలో తాను నిర్వహిస్తోన్న కీలక పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐలో తాను నిర్వహిస్తోన్న కీలక పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ కలిసి త్రి సభ్య కమిటీగా ఉంది. వీరి సూచన మేరకే టీమిండియా హెడ్ కోచ్‌ను ఎంపిక చేస్తారు. గతంలో అనిల్ కుంబ్లేను.. అతని పదవీ కాలం పూర్తయ్యాక రవిశాస్త్రిని ఎంపిక చేసింది ఈ కమిటీయే.
Read Also : ధోనీ ముందు నేను.. ఓ ఫస్ట్ ఎయిడ్ కిట్ అంతే..
ఇప్పుడు ఈ కమిటీ నుంచే సౌరవ్ గంగూలీ తప్పుకోనున్నారు. ఈ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుడిగా పని చేస్తున్న గంగూలీ ఐపీఎల్ కోసమే కోపం తెచ్చుకున్నాురు. ఇటీవల ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ పై వివాదం చెలరేగింది. గంగూలీ విరుద్ధ ప్రయోజనాల కోసమే ఇలా చేశాడని కోల్‌కతా అభిమానులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.
క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా గంగూలీ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో పిచ్ క్యూరేటర్‌ని ప్రలోభాలకి గురిచేసే అవకాశం ఉందని అభిమానులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. గత వారమే ముగిసిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. గంగూలీ ఇంకా ఆ మ్యాచ్ విషయంలో కోపంగానే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీసీసీఐ అంబుడ్స్‌మెన్‌ని కలిసిన గంగూలీ క్యాబ్ అధ్యక్షుడు, ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుడి పదవులు విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు రావని వివరణ ఇచ్చాడు. దానికి క్రికెట్ సలహా కమిటీ గురించి ప్రశ్నలు మొదలవడంతో రాజీనామా చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
Read Also : వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన, జోఫ్రా ఆర్చర్ ఔట్