Muthiah Muralidaran Biopic: నా బౌలింగ్‌ను పక్కాగా అంచనా వేసింది ఆ ముగ్గురే.. ద్రవిడ్, లారా వంటి దిగ్గజాలు ఇబ్బంది పడేవారు
సచిన్, ముత్తయ్య మురళీధరన్‌లు ప్రత్యర్థులుగా ఎన్నో మ్యాచులను ఆడినప్పటికీ, మైదానం బయట వారిద్దరు ఎంతో మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే.

Muthiah Muralidaran Biopic
800 Trailer OUT: శ్రీలంక క్రికెట్ దిగ్గజం, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమా 800. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. టెస్టు క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచిన ముత్తయ్య మురళీధరన్ పాత్రలో స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ నటిస్తున్నారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈ వెంట్‌ను ముంబైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సచిన్ టెండూల్కర్ హాజరయై సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
Muttiah Muralitharan : ఎట్టకేలకు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్…
సచిన్, ముత్తయ్య మురళీధరన్‌లు ప్రత్యర్థులుగా ఎన్నో మ్యాచులను ఆడినప్పటికీ, మైదానం బయట వారిద్దరు ఎంతో మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమంలో ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే గొప్ప బ్యాటర్లలో ఒకడైన రాహుల్ ద్రవిడ్ తన బౌలింగ్‌ను అర్ధం చేసుకోలేక పోయాడని మురళీధరన్ అన్నారు. నా బౌలింగ్ ను సచిన్ తెందుల్కర్ మాత్రమే పక్కాగా అంచనా వేసేవాడని, చాలా మంది అలా చేయలేక పోయారని చెప్పారు. బ్రియన్ లారా వంటి విజయవంతమైన గొప్ప క్రికెట్ దిగ్గజాలుసైతం నా బౌలింగ్ లో షాట్లు ఆడలేక పోయారని అన్నారు.
అలా పుట్టడం నా తప్పా? ‘800’ వివాదంపై మురళీధరన్ స్పందన.. విజయ్ సేతుపతికి రాధిక మద్దతు..
ఇండియా బ్యాటర్లలో సచిన్ తెందుల్కర్, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌లకు నా బౌలింగ్ అర్థం చేసుకొని పక్కా వ్యూహంతో ఆడటం సాధ్యమైందని ముత్తయ్య మురళీధర్ అన్నారు. మా శ్రీలంక జట్టులోనూ కొందరు నా బౌలింగ్ అర్థంచేసుకున్నా.. మరికొందరు విఫలమయ్యారని మురళీధరన్ పేర్కొన్నారు. తమిళంలో రూపొందించిన ‘800’ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఆల్ఇండియా పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ దక్కించుకున్నారు.