సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు స్వల్ప టార్గెట్ ఉంచిన ఢిల్లీ క్యాపిటల్స్.. డీసీ బ్యాటర్లు ఎలా విఫలమయ్యారంటే?
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ తీసుకుంది.

Pic: @IPL (X)
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ తీసుకుంది.
Also Read: వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..
బ్యాటింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విఫలమైంది. కరుణ్ నాయర్ 0, ఫాఫ్ డు ప్లెసిస్ 3, అభిషేక్ పోరెల్ 8, కేఎల్ రాహుల్ 10, అక్షర్ పటేల్ 6 పరుగులకే ఔటయ్యారు. అనంతరం వచ్చిన ట్రిస్తాన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ రాణించారు.
ట్రిస్తాన్ స్టబ్స్ 41 (నాటౌట్), విప్రజ్ నిగమ్ 18, అశోతోష్ శర్మ 41 పరుగులు బాదారు. చివరలో వచ్చిన స్టార్క్ ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 133గా నమోదైంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3 వికెట్లు, జయదేవ్ ఉనద్కట్, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, నటరాజన్