మళ్లీ గెలిచాం: కివీస్‌పై భారీ విజయం సాధించిన కోహ్లీసేన
కివీస్ పై మరోసారి పైచేయి సాధించింది టీమిండియా. ఆరంభం నుంచి గడగడలాడించిన భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించారు. కివీస్ బ్యాట్స్ మెన్ ను ఘోరంగా కట్టడి చేయడంతో భారత బౌలర్లు.. న్యూజిలాండ్ ను చిత్తు చేయగలిగారు.

కివీస్ పై మరోసారి పైచేయి సాధించింది టీమిండియా. ఆరంభం నుంచి గడగడలాడించిన భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించారు. కివీస్ బ్యాట్స్ మెన్ ను ఘోరంగా కట్టడి చేయడంతో భారత బౌలర్లు.. న్యూజిలాండ్ ను చిత్తు చేయగలిగారు.
కివీస్‌పై మరోసారి పైచేయి సాధించింది టీమిండియా. ఆరంభం నుంచి గడగడలాడించిన భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించారు. కివీస్ బ్యాట్స్ మెన్‌ను ఘోరంగా కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమైయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. విలియమ్సన్ సేన ముందు 325 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది.
లక్ష్య చేధనకు దిగిన న్యూజిలాండ్ తొలి పది ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు విఫలమవడంతో ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసిన బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలిచేందుకే సతమతమయ్యారు. తొలి వన్డేలో చాహల్ విజృంభించగా రెండో వన్డే కుల్దీప్ వంతు అయింది.
నాలుగు వికెట్లు పడగొట్టి కివీస్‌ను చిత్తు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. అతనిలో పాటు భువనేశ్వర్ కుమార్ (2), షమీ(1), చాహల్(2), కేదర్ జాదవ్(1) వికెట్లు తీయగలిగారు.
భారత ఇన్నింగ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన ఆరంభాన్ని అదరగొట్టింది. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ కివీస్ జట్టుపై విరుచుకుపడింది. ఓపెనర్లు శుభారంభాన్ని నమోదు చేసి 154 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ల వికెట్లను టీమిండియా స్వల్ప వ్యవధిలో కోల్పోయింది. తొలుత రోహిత్ శర్మ 62 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. శిఖర్ ధావన్ 53 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. బౌల్ట్ వేసిన 26వ ఓవర్ రెండో బంతికి ధావన్(66; 67 బంతుల్లో 9 ఫోర్లు).. వికెట్ కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆపై కొద్దిసేపటికి రోహిత్(87; 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫెర్గీసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి శతకాన్ని చేజార్చుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ కోహ్లి(17), అంబటి రాయుడు(84) ఉన్నారు. 33 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 196 పరుగులు చేసింది. ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియాలో రోహిత్ శర్మ (87)పరుగులతో ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు.