Vijay Hazare Trophy : దంచికొట్టిన ధావన్.. ఫస్ట్ టైం ఫైనల్లోకి హిమాచల్
దేశీవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. హిమాచల్‌కు కెప్టెన్ రిషి ఆల్ రౌండ్ షోతో అదరగొట్టేశాడు.

Vijay Hazare Trophy Rishi Dhawan Leads Himachal Pradesh To Final (1)
Vijay Hazare Trophy : దేశీవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో హిమాచల్ ప్రదేశ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. హిమాచల్ ప్రదేశ్ జట్టుకు సారథ్యం వహించిన కెప్టెన్ రిషి ధావన్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టేశాడు. ధావన్ (9 ఫోర్లు, 1 సిక్స్)తో 84 పరుగులతో రాణించాడు.
సర్వీసెస్ తో జరిగిన సెమీఫైనల్లో హిమాచల్ జట్టు 77 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. హిమాచల్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రశాంత్ చోప్రా 109 బంతుల్లో 78 పరుగులు సాధించగా.. మరో ఆటగాడు ఆకాశ్ వశిష్ట్ 4 ఫోర్లు, 2 సిక్సులతో రాణించి 29 బంతుల్లో 45 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సర్వీసెస్ 46.1 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌటైంది.
మరో సెమీస్ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు సౌరాష్ట్ర జట్టుపై 2 వికెట్ల తేడాతో గెలిచింది. సౌరాష్ట్ర నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యాన్ని తమిళనాడు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విజయ్ హజారే ట్రోపీలో హిమాచల్ ప్రదేశ్ జట్టు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లగా.. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన తమిళనాడు జట్లు ఏడోసారి ఫైనల్లోకి తీసుకెళ్లింది. ఫైనల్ టోర్నీలో హిమాచల్ ప్రదేశ్ జట్టు, తమిళనాడు జట్టు తలపడనున్నాయి.
Read Also : Apple Days Sale : ఆపిల్ ఇయర్ ఎండ్ సేల్.. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు..
WHAT. A. WIN!? ?
Captain @rishid100 stars with bat and ball as Himachal Pradesh beat Services by 77 runs to march into the #VijayHazareTrophy #Final. ? ? #SF1 #HPvSER
Scorecard ▶️ https://t.co/MWsWAq2Q2B pic.twitter.com/tsK7Ua08Mr
— BCCI Domestic (@BCCIdomestic) December 24, 2021