Viral Video: ఏం క్యాచ్ పట్టావ్ భయ్యా.. ఊహించని రీతిలో శిఖర్ ధావన్ క్యాచ్

ఢిల్లీ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో 10.1వ ఓవర్ వద్ద సామ్‌ కరణ్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్ చేశాడు.

Viral Video: ఏం క్యాచ్ పట్టావ్ భయ్యా.. ఊహించని రీతిలో శిఖర్ ధావన్ క్యాచ్

Shikar Dhavan

Updated On : May 18, 2023 / 9:03 AM IST

Viral Video: పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ అందుకున్న క్యాచ్‌ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా నిన్న జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ (PBKS)పై ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ (DC) గెలిచిన విషయం తెలిసిందే.

ఢిల్లీ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో 10.1వ ఓవర్ వద్ద సామ్‌ కరణ్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్ చేశాడు. భారీ షాట్ ఆడాడు. శిఖర్ ధావన్‌ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. ఢిల్లీ 94 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

డేవిడ్ వార్నర్ ఈ ఐపీఎల్ లో మొత్తం 13 మ్యాచులు ఆడి 430 పరుగులు చేశాడు. అందులో 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నిన్నటి హాఫ్ సెంచరీ మిస్ కాకపోతే అతడి ఖాతాలో మరో అర్ధ సెంచరీ వచ్చి చేరేది. లీగ్ మ్యాచులు ముగుస్తున్న వేళ ప్లే ఆఫ్స్ లో నిలవడానికి జట్లు పోటీ పడుతున్నాయి. ఢిల్లీతో మ్యాచ్ లో ఓడిపోవడంతో పంజాబ్ కింగ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి.

IPL 2023: ఢిల్లీ విజ‌యం.. పంజాబ్ ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం