గంగూలీ కీలక ప్రకటన: భారత క్రికెట్‌లో పెను మార్పు

గంగూలీ కీలక ప్రకటన: భారత క్రికెట్‌లో పెను మార్పు

Updated On : October 26, 2019 / 3:42 AM IST

భారత క్రికెట్ చరిత్రలో మరో కీలక మార్పు సంతరించుకోనుంది. మరికొద్ది రోజుల్లో భారత జట్టు డే అండ్‌ నైట్‌ టెస్టులు ఆడడం ఖాయమని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. ఈ తరహా టెస్టులను ఆడేందుకు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆసక్తిగా ఉన్నాడని వెల్లడించాడు. వచ్చే ఏడాది చివర్లో ఆడే అవకాశం ఉండడంతో అప్పటికీ దాదా పదవీకాలం ముగియనుంది. 
 
‘పింక్‌ బాల్‌ టెస్టులు ఆడేందుకు కోహ్లీ కూడా సుముఖంగానే ఉన్నాడు. కోహ్లీ విముఖత చూపుతున్నట్టు గతంలో వచ్చిన కథనాలన్నీ అసత్యాలు. భారత జట్టు గులాబీ టెస్టు ఎప్పుడు ఆడుతుందనేది కచ్చితంగా చెప్పలేను. పదవిలో ఉన్న సమయంలోనే గట్టిగా కృషి చేస్తా’ అని ఈడెన్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో గంగూలీ వివరించాడు. 

దీంతో పాటు ప్రస్తుత క్రికెటర్లను రాటుదేల్చేలా జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)ని పునరుద్ధరించాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని లక్ష్మణ్‌ కోరాడు.