IPL 2024 : ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ ఆడుతాడా? లేదా?.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది

ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

IPL 2024 : ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ ఆడుతాడా? లేదా?.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది

IPL 2024

virat kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 టోర్నీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగబోతోంది. అయితే, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ప్రాక్టీస్ సెషన్ లోకి అడుగు పెట్టలేదు. దీంతో కోహ్లీ ఈసారి ఐపీఎల్ లో ఆడుతున్నాడా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలాకాలంగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ ఇంగ్లండ్ తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లోనూ ఆడలేదు.

Also Read : IPL 2024 : హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడడంపై ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు

విరాట్ కోహ్లీ ఐపీఎల్ -2024లో ఆడుతున్నాడా లేదా అనే విషయంపై అతని ప్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచికూడా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. ఐపీఎల్ -2024 టోర్నీ ప్రారంభంరోజే అంటే.. తొలి మ్యాచ్ లోనే ఆర్సీబీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆడాల్సి ఉంది. మరో వారం రోజుల సమయమే ఉంది. అయినా కోహ్లీ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటున్నట్లు కనిపించలేదు. తాజాగా ESPNcricinfo నివేదిక ప్రకారం.. కోహ్లీ ఐపీఎల్ 2024టోర్నీలో ఆడేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని తెలిపింది. కోహ్లీ ఆర్సీబీ క్యాంప్ లోకి ఇంకా చేరనప్పటికీ అతను ఈనెల 22న తొలి మ్యాచ్ ముందు బెంగళూరులో జరిగే ప్రీ టోర్నమెంట్ క్యాంప్ లో జట్టుతో చేరతాడని తెలిపింది.

Also Read : హార్ధిక్, బుమ్రాలు ముంబై జట్టులో కొనసాగడానికి రోహిత్ శర్మనే కారణం.. పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ 2024కి సంబంధించి బీసీసీఐ ఇప్పటి వరకు కేవలం 21 మ్యాచ్ లషెడ్యూల్ ను మాత్రమే ప్రకటించింది. దీనికి కారణం దేశంలో లోక్ సభ ఎన్నికలు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన తరువాత ఆ తేదీలను బట్టి మ్యాచ్ ల నిర్వహణకు తదుపరి తేదీలను ప్రకటించాలని బీసీసీఐ భావించింది. తాజాగా దేశంలో లోక్ సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ ను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.