Viral Video: షాహీన్ అఫ్రిదీ వేసిన బంతి తగిలి నొప్పితో విలవిల్లాడిపోయిన అఫ్గాన్ బ్యాట్స్‌మన్

ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిదీ వేసిన బంతి అఫ్గాన్ బ్యాట్స్ మన్ రహ్మానుల్లా గుర్బాజ్ ఎడమ పాదానికి తగలడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. తాజాగా జరిగిన వార్మప్ మ్యాచులో టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్లో షాహీన్ అఫ్రిదీ బంతులు వేశాడు.

Viral Video: షాహీన్ అఫ్రిదీ వేసిన బంతి తగిలి నొప్పితో విలవిల్లాడిపోయిన అఫ్గాన్ బ్యాట్స్‌మన్

Updated On : October 19, 2022 / 12:18 PM IST

Viral Video: ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిదీ వేసిన బంతి అఫ్గాన్ బ్యాట్స్ మన్ రహ్మానుల్లా గుర్బాజ్ ఎడమ పాదానికి తగలడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. తాజాగా జరిగిన వార్మప్ మ్యాచులో టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్లో షాహీన్ అఫ్రిదీ బంతులు వేశాడు.

అఫ్గాన్ హజ్రతుల్లా జజాయిీ నాలుగో బంతిలో సింగిల్ చేశాడు. అనంతరం రహ్మానుల్లా గుర్బాజ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిదీ యార్కర్ వేశాడు. బంతి వేగంగా వెళ్లి రహ్మానుల్లా గుర్బాజ్ ఎడమ బూటుకు తగిలింది. నొప్పితో గుర్బాజ్ కనీసం నడవలేకపోయాడు. అతడిని తోటి ఆటగాళ్లు భుజంపై ఎత్తుకుని మైదానం నుంచి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అనంతరం గుర్బాజ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు.


10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..