David Warner: డేవిడ్ వార్నర్‌కు మంచి టైం ఉందని చెబుతున్న సన్‌రైజర్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఐపీఎల్ 2022లో నీకు మంచి టైం వస్తుందిలే అంటూ చేసిన ట్వీట్ శోచనీయంగా మారింది.

David Warner
David Warner: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఐపీఎల్ 2022లో నీకు మంచి టైం వస్తుందిలే అంటూ చేసిన ట్వీట్ శోచనీయంగా మారింది. దానిపై రెస్పాండ్ అయిన వార్నర్.. ఆరెంజ్ ఆర్మీపై సందేహం వ్యక్తం చేశాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం తర్వాత వార్నర్ ఫామ్ గురించి కొనియాడుతూ ట్వీట్ చేసింది.
‘యాషెస్ లో గెలిచినందుకు కంగ్రాట్స్ డేవీ.. నువ్వు మళ్లీ ఫామ్ లోకి వచ్చావనుకుంటున్నాం. మరో వైపు తర్వాతి వేలంలో నీకు మంచి టైం ఉందని భావిస్తున్నాం’ అని అఫీషియల్ సన్‌రైజర్స్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు పెట్టారు.
ఐపీఎల్ 2021లో డేవిడ్ వార్నర్ ను మధ్యలోనే తప్పించి కేన్ విలియమ్సన్ కు అవకాశం ఇచ్చారు. సీజన్ మొత్తం తనను తప్పించారంటూ ఆస్ట్రేలియాకు వెళ్లకుండానే నిరసన వ్యక్తం చేస్తూ ఉండిపోయాడు. ఆ సీజన్ లో ఎస్సార్హెచ్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ముగించింది.
ఇది కూడా చదవండి : పెట్రోల్ బంక్‍లో దొంగల బీభత్సం
ఇదిలా ఉంటే ఐపీఎల్ క్రికెట్ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో డేవిడ్ వార్నర్ ఒకరు. 5వేల 449పరుగులు చేసి స్ట్రైక్ రేట్ 140తో ఉన్నాడు.