Virat Kohli : పుట్టిన రోజు నాడే చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. సచిన్ శతకాల రికార్డు సమం
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు.

Sachin-Virat
IND vs SA : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేసి ఈ ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 49 వ శతకం కావడం విశేషం.
వన్డేల్లో సచిన్ 49 శతకాలు చేయడానికి 452 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. విరాట్ కోహ్లీ కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకోవడం విశేషం.
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితా..
విరాట్ కోహ్లీ (భారత్) – 49 శతకాలు (277 ఇన్నింగ్స్‌లు)
సచిన్ టెండూల్కర్ (భారత్) – 49 శతకాలు (452 ఇన్నింగ్స్‌లు)
రోహిత్ శర్మ(భారత్) – 31శతకాలు (251 ఇన్నింగ్స్‌లు)
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 30 (365 ఇన్నింగ్స్‌లు)
సనత్ జయసూర్య (శ్రీలంక)- 28 శతకాలు (433 ఇన్నింగ్స్‌లు)
Virat Kohli : పుట్టిన రోజు నాడు హాఫ్ సెంచరీలు చేసిన టీమ్ఇండియా ప్లేయర్లు ఎవరో తెలుసా..?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (101 నాటౌట్; 121 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీ చేశాడు. శ్రేయస్ అయ్యర్ (77; 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం చేశాడు. రోహిత్ శర్మ (40; 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (29 నాటౌట్; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, షమ్సీ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
??????? in Kolkata for the Birthday Boy! ??
From scoring his Maiden century in Kolkata to scoring his 4⃣9⃣th ODI Ton ??#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/pA28TGI4uv
— BCCI (@BCCI) November 5, 2023