ఇది క్రికెట్టా : స్కోరు 9.. డకౌట్‌లు 9

సమఉజ్జీలు ఉన్నప్పుడే ఏ ఆట అయినా పోటాపోటీగా సాగుతుంది. అలా కాకుండా మ్యాచ్ ఏకపక్షం అయిపోతే.. 6 బంతుల్లోనే మ్యాచ్ ముగిసిపోతే.. అంతకన్నా చెత్త మ్యాచ్ మరొకటి ఉండదు. చాలా అరుదుగా జరిగే మ్యాచ్‌లలో ఒకటైన చెత్త ఈ మ్యాచ్ పాండిచ్చేరిలోని పాల్మైరా క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో అతి తక్కువ పరుగులే కాక, అస్సలేం చేయకుండానే వెనుదిరిగారు తొమ్మిది మంది.
మిజోరాం, మధ్య ప్రదేశ్ మహిళా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో 13.5 ఓవర్ల పాటు ఆడిన మిజోరాం జట్టు కేవలం అత్యల్పంగా 9 పరుగులు మాత్రమే నమోదు చేయగలిగింది. ఆ స్కోరు చేసింది ఒకే ఒక్క బ్యాటర్. మిగిలిన వాళ్లంతా డకౌట్‌లుగా వెనుదిరిగారు. అపూర్వ భరద్వాజ్ మాత్రమే 25బంతులను ఎదుర్కొని 6 పరుగులు చేసింది. దాంతో పాటు 3 ఎక్స్‌ట్రాలు చేరడంతో జట్టు స్కోరు 9గా నమోదైంది.
ఆ తర్వాత మిజోరాం నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం ఆరు బంతుల్లోనే పూర్తి చేయగలిగిన మధ్యప్రదేశ్ ఎట్టకేలకు విజేతగా నిలిచింది. మిజోరాంకు ఇంత ఘోరంగా ఓడిపోవడం రెండోసారి. ఫిబ్రవరి 20న కేరళతో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగులు చేసి ఆలౌట్‌తో మిగిలిపోగా కేరళ తక్కువ బంతుల్లోనే లక్ష్యాన్ని కొట్టేసింది.
Read Also: గుండెల్ని పిండేసే ఘటన : అమర జవానుకు భార్య చివరి ముద్దు
Read Also: సినిమా రివ్యూ : ఎన్టీఆర్ మహానాయకుడు
Read Also: ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం : సీఎం కేసీఆర్