మ్యాక్ యాప్ స్టోర్ : ఆపిల్ యూజర్ల కోసం ఎక్స్ క్లూజివ్ అప్‌డేట్స్

ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తమ యూజర్ల కోసం ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ ను ప్రవేశపెట్టింది.

  • Published By: sreehari ,Published On : January 25, 2019 / 01:30 PM IST
మ్యాక్ యాప్ స్టోర్ : ఆపిల్ యూజర్ల కోసం ఎక్స్ క్లూజివ్ అప్‌డేట్స్

ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తమ యూజర్ల కోసం ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ ను ప్రవేశపెట్టింది.

ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తమ యూజర్ల కోసం ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ ను ప్రవేశపెట్టింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న ఆపిల్.. చివరికి మ్యాక్స్ యాప్ స్టోర్ లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365ను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ విండోస్ సిస్టమ్ లో ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎక్స్ఎల్ వంటి పాపులర్ సిగ్నేచర్ యాప్స్ ను యూజర్లు నేరుగా డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. ఇప్పుడు మ్యాక్ ఆప్ స్టోర్ నుంచి కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365 ను కూడా ఆపిల్ యూజర్లు పొందొచ్చు. ఆఫీసు 365 ప్యాకేజీని ప్రత్యేకించి ఆపిల్ యూజర్ల కోసం డిజైన్ చేశారు. మ్యాక్ సిస్టమ్ లోని ఫీచర్లకు సపోర్ట్ చేసేలా ఆఫీసు 365 యాప్ ను డిజైన్ చేశారు. ఆఫీసు 365 ప్యాకేజీ సబ్ స్ర్కిప్షన్ కోసం మ్యాక్ యాప్ స్టోర్ నుంచి ఆపిల్ యూజర్లు కొనుగోలు చేయొచ్చు. మ్యాక్ ఆఫ్ స్టోర్ నుంచి అందిస్తున్న లెటేస్ట్, బెస్ట్ వర్షన్ ఆఫీస్ 365 ప్యాకేజీని మ్యాక్ ఓఎస్, ఐప్యాడ్, ఐఫోన్లలో ఆపరేట్ చేయొచ్చు. మ్యాక్ ఓఎస్ లో అందిస్తున్న డార్క్ మోడ్, కంట్యూనిటీ కెమెరా వంటి ఫీచర్లకు సపోర్ట్ చేసేలా డిజైన్ చేశారు. 

అంతేకాదు.. మ్యాక్ బుక్ ప్రో టచ్ బార్, మ్యాక్ ట్రాక్ ప్యాడ్ వంటి యాప్ లకు కూడా ఈ సపోర్ట్ చేస్తుంది. గత ఏడాదిలో జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ లోనే ఆపిల్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్ ను ఆపిల్ స్టోర్ లో ప్రవేశపెట్టనున్నట్టు తొలిసారి సంస్థ ప్రకటించింది. క్యూపర్టినో, కాలిఫోర్నియా ఆధారిత టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆఫీసు ఫ్యాకేజీ 2018 ఏడాది ఆఖరికి అందుబాటులోకి వస్తుందని హమీ ఇచ్చింది కూడా. ఆపిల్, మైక్రోసాఫ్ట్ రెండు దిగ్గజాలు కలిసి సంయుక్తంగా మ్యాక్ యూజర్లకు ఆరంభం నుంచే ఆఫీసు 365 ప్యాకేజీని అందించేలా పనిచేశాయి.  విండోస్ ఎంతగా పాపులర్ అయిందో.. ఆపిల్ మ్యాక్ కూడా అంతే పాపులారీటీ పొందింది. విండోస్ తో పోలిస్తే దీని విలువ కాస్త ఎక్కువనే చెప్పాలి. ఆపిల్ బిజినెస్ మేనేజర్ ద్వారా ముందుగా ఆపిల్ ఉద్యోగులకు ఆఫీసు 365 యాప్స్ ను అందించనున్నారు. బిజినెస్ మేనేజర్ అనేది సెంట్రల్ డ్యాష్ బోర్డ్. ఆపిల్ యూజర్ల కోసం ప్రత్యేకించి డిజైన్ చేసిన ఆఫీస్ టూల్స్.. మ్యాక్, ఐప్యాడ్, ఐఫోన్ టూల్స్ పై ఐటీ బృందం, ఉద్యోగులు సులభంగా వర్క్ చేసే విధంగా డిజైన్ చేశారు.