హోం ఐసోలేషన్ బోర్ కొడుతుందా? Netflix Party ఫీచర్ ద్వారా మీ స్నేహితులతో స్ట్రీమ్ మూవీలను చూడొచ్చు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వణికిస్తోంది. ప్రపంచదేశాల్లో భారతదేశం సహా చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా నియంత్రణకు ప్రపంచమంతా సామాజిక దూరం పాటిస్తున్నాయి. అందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. అంతటా లాక్ డౌన్ విధించడంతో ఎవరూ బయట తిరిగే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఐసోలేషన్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అందుకే.. ఓటీటీ స్ట్రీమింగ్ కంపెనీలు తమ యూజర్లను ఎంటర్ టైన్ చేసేందుకు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రధాన OTT పోటీదారుల్లో ఒకటైన నెట్ ఫ్లిక్స్.. తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే.. Netflix Party ఫీచర్.. దీనిద్వారా యూజర్ల తమ స్నేహితులను వాచ్ పార్టీకి ఆహ్వానించవచ్చు. అంతేకాదు.. ఒకవైపు మూవీలు చూస్తేనే.. మరోవైపు స్నేహితులతో లైవ్ చాట్ చేసుకోవచ్చు.
అందుకు మీరు చేయాల్సిందిల్లా గూగుల్ క్రోమ్ నుంచి నెట్ ఫ్లిక్స్ ఎక్స్ టెన్షన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీ కంప్యూటర్‌లో గూగుల్ Chrome Browser ఓపెన్ చేయండి.. అందులో Netflix Party అనే Chrome extension ఒకటి అందుబాటులో ఉంది.
మీరు నెట్ ఫ్లిక్స్ యూజర్లా? మీ నెట్ ఫ్లిక్స్ అకౌంట్లలో మూవీలను స్నేహితులతో కలిసి స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. కొత్త నెట్ ఫ్లిక్స్ యూజర్లు అయితే అకౌంట్ సబ్ స్ర్కిప్షన్ తీసుకోవడానికి ముందు 30 రోజుల ఉచిత ట్రయల్ పొందవచ్చు. ఆ తర్వాత మీరు ప్రిమియం యూజర్లుగా మారిపోవచ్చు. ఇప్పటివరకూ నెట్ ఫ్లిక్స్‌లో స్ర్కీన్ షేరింగ్ ఆప్షన్ ఉంది. మీతో పాటు మీ స్నేహితులను కూడా నెట్ ఫ్లిక్స్ వాచ్ పార్టీ ద్వారా నచ్చిన మూవీలతో పాటు టీవీ షోలను కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు..
Netflix Party extension ఎలా Download చేసుకోవాలంటే? :
* ముందుగా మీరు ఇన్వైట్ చేసే వారికి కూడా నెట్ ఫ్లిక్స్ అకౌంట్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ తప్పక ఉండాలి.
* అప్పుడే నెట్ ఫ్లిక్స్ పార్టీ ఫీచర్ సెకన్ల వ్యవధిలో కనెక్ట్ చేసుకోవచ్చు.
* మీ కంప్యూటర్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.
* ఈ లింక్ Netflix Party (https://www.netflixparty.com/) క్లిక్ చేయండి.
* Get netflix party లేదా Install Netflix party అనే ఆప్షన్ ఉంటుంది.
* Chrome వెబ్ స్టోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ Extension కనిపిస్తుంది.
* ఇక్కడ Netflix Party (NP)ను Add to Chrome బటన్ పై క్లిక్ చేయండి.
* Add Extension ఆప్షన్ పై కూడా క్లిక్ చేయండి.
* మీ క్రోమ్ బ్రౌజర్ కుడివైపు కార్నర్ పైభాగంలో NP ఐకాన్ కనిపిస్తుంది.
* Netflix websiteలోకి వెళ్లండి.. ఇక్కడ Movie లేదా Show వాచ్ ఎంపిక చేయండి.
* NP ఐకాన్ పై క్లిక్ చేయండి.. ఇందులో మీకు ఒక URL కనిపిస్తుంది.
* ఈ URL ను మీ స్నేహితులకు కూడా షేర్ చేసుకోవచ్చు.
* ఈ లింక్ యాక్సస్ చేసుకున్నవారితో కలిసి మూవీ స్ట్రీమ్ చేయొచ్చు.
* మీకు Netflix Party Link పొందే ముందు క్రోమ్ NP ఎక్స్ టెన్షన్ ఇన్ స్టాల్ అయి ఉండాలి.
* మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే Netflix websiteకు రీడైరెక్ట్ అయిపోతారు.
* అక్కడే NP ఐకాన్ క్లిక్ చేస్తే చాలు.. టాప్ రైట్ కార్నర్ లో వాచ్ పార్టీలో జాయిన్ కావొచ్చు.
See Also |రిలయన్స్ జియోలో 10శాతం వాటా కొనుగోలు చేయనున్న ఫేస్ బుక్!