లీక్‌ల‌కు బ్రేక్: శాంసంగ్ గెలాక్సీ M30 వచ్చేసింది, ధర ఎంతంటే?

మొబైల్ మార్కెట్లోకి శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కాకముందే ఆ ఫోన్ కు సంబంధించి ఫీచర్లు లీక్ అయినట్టు రూమర్లు చక్కెర్లు కొడుతున్నాయి.

  • Published By: sreehari ,Published On : February 27, 2019 / 12:05 PM IST
లీక్‌ల‌కు బ్రేక్: శాంసంగ్ గెలాక్సీ M30 వచ్చేసింది, ధర ఎంతంటే?

Updated On : February 27, 2019 / 12:05 PM IST

మొబైల్ మార్కెట్లోకి శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కాకముందే ఆ ఫోన్ కు సంబంధించి ఫీచర్లు లీక్ అయినట్టు రూమర్లు చక్కెర్లు కొడుతున్నాయి.

మొబైల్ మార్కెట్లోకి శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కాకముందే ఆ ఫోన్ కు సంబంధించి ఫీచర్లు లీక్ అయినట్టు రూమర్లు చక్కెర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్ ను బ్రేక్ చేస్తూ దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ గెలాక్సీ ఎం30 సిరీస్ ను లాంచింగ్ చేయనుంది. ఇండియా మార్కెట్లో (ఫిబ్రవరి 27, 2019) సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ కామర్స్ వెబ్ సైట్లు అమెజాన్ ఇండియా, శాంసంగ్ వెబ్ సైట్లలో శాంసంగ్ గెలాక్సీ ఎం30 సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ల్లు అందుబాటులోకి రానున్నాయి. 
Also Read:  సర్జికల్ స్ట్రయిక్స్ – 2.0 స్పెషల్ స్టోరీస్

శాంసంగ్ సంస్థ ప్రవేశపెట్టిన గెలాక్సీ సిరీస్ ల్లో M30 స్మార్ట్ ఫోన్ మూడో సిరీస్. ఈ ఏడాది జనవరిలోనే శాంసంగ్ రెండు గెలాక్సీ సిరీస్ (గెలాక్సీ M10, గెలాక్సీ M20 స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. గెలాక్సీ ఎం30 సిరీస్ స్మార్ట్ ఫోన్లో ఫీచర్లపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. రెండు గెలాక్సీ సిరీస్ ల కంటే మూడో సిరీస్ లో ఫీచర్లు ఆకర్షణీయంగా ఉంటాయని సంస్థ అధికారులు చెబుతున్నారు. గెలాక్సీ ఎం30 సిరీస్ లో ట్రిపుల్ కెమెరా సెట్ అప్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. సెక్యూరిటీ కోసం రియర్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ కూడా ఉంది. లేటెస్ట్ ఎక్సోనస్ 7904 ప్రాసిసెర్, ఫ్రంట్ కెమెరా 16 మెగా ఫిక్సల్ ఉంటుంది. 

ఇండియా మార్కెట్లోకి త్వరలో రానున్న జియోమీ రెడ్ మీ నోట్ 7 మొబైల్ కు ధీటుగా శాంసంగ్ ఎం30 సిరీస్ ను విడుదల చేస్తోంది. జియోమీ రెడ్ మీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 28, 2019న భారత మార్కెట్లోకి విడుదల కానుంది. రెడ్ మీ నోట్ 7 ఫోన్ లో 48 మెగాఫిక్సల్ ప్రైమరీ రియర్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫోన్ విడుదలకు ఒక రోజు ముందుగానే శాంసంగ్ మూడో గెలాక్సీ సిరీస్ ను ఇండియా మార్కెట్లలో విడుదల చేయనుంది.
Also Read:  పాక్ కూల్చిన భారత యుద్ధ విమానాలు ఇవే

ఇప్పటికే గెలాక్సీ సిరీస్ లను మార్కెట్లోకి విడుదల చేసిన శాంసంగ్.. మూడో గెలాక్సీ సిరీస్ ఎం30 ఫోన్ ధరపై కూడా అదే స్థాయిలో రూమర్స్ వెల్లువెత్తాయి. గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 తరహాలో గెలాక్సీ ఎం30 సిరీస్ ఫోన్ ప్రారంభం ధర రూ.12వేలు, ఆపైనే ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం10 ప్రారంభ ధర కూడా రూ.7వేల 990 ఉండగా, ఎం20 స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.10వేల 990 నుంచి ప్రారంభమైంది. 

శాంసంగ్ గెలాక్సీ ఎం30 స్పెషిఫికేషన్స్
* 6.4 అంగుళాల AMOLED ఇన్ఫినిటీ యు డిసిప్లే
5000ఎంఎహెచ్ బ్యాటరీ, 3ఎక్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
కొత్త Exynos 7904 ప్రాసిసెర్
ఫ్రంట్ కెమెరా 16 మెగా ఫిక్సల్

Also Read: క్షేమంగా తిరిగి రావాలి : విక్రమ్ అభినందన్ ఎవరంటే..