Corona : తెలంగాణలో కొత్తగా 324 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 324 కరోనా కేసుల నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 73,323 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. 24 గంటల్లో కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు.

Corona (4)
corona cases in Telangana : తెలంగాణలో కొత్తగా 324 కరోనా కేసుల నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 73,323 మందికి కరోనా టెస్టులు నిర్వహించంగా 324 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,526కు చేరింది.
కొత్తగా 280 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,53,302 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో వైరస్ బారినపడి 3,899 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,325 యాక్టివ్ కేసులున్నాయి.
Covid-19 : దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
ప్రస్తుత కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలోనే 79 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఆ తర్వాత ఖమ్మంలో 24, కరీంనగర్‌లో 22, నల్గొండలో 19, రంగారెడ్డిలో 18 మంది వైరస్‌కు పాజిటివ్‌గా తేలారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.60శాతం, మరణాలు రేటు 0.58శాతం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.