తెలంగాణలో కొత్తగా 997 కరోనా కేసులు, నలుగురు మృతి

  • Published By: bheemraj ,Published On : November 13, 2020 / 11:45 AM IST
తెలంగాణలో కొత్తగా 997 కరోనా కేసులు, నలుగురు మృతి

Updated On : November 13, 2020 / 11:55 AM IST

Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 997 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 169 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,222 మంది పూర్తిగా కోలుకున్నారు.



రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 55 వేల 663కు చేరుకోగా, 1,397 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,37,172 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 17,094 ఉండగా, గృహ/సంస్థల ఐసోలేషన్ లో గల వ్యక్తుల సంఖ్య 14, 466గా ఉంది.



ఆదిలాబాద్ 18, భద్రాద్రి కొత్తగూడెం 65, జీహెచ్ఎంసీ 169, జగిత్యాల 23, జనగామ 11, జయశంకర్ భూపాలపల్లి 16, జోగులాంబ గద్వాల 10, కామారెడ్డి 22, కరీంనగర్ 49, ఖమ్మం 44, కొమరం భీం ఆసిఫాబాద్ 0, మహబూబ్ నగర్ 16, మహబూబాబాద్ 20, మంచిర్యాల 19, మెదక్ 16, మేడ్చల్ మల్కాజ్ గిరి 85, ములుగు 21 కేసుల చొప్పున నమోదు అయ్యాయి.

నాగర్ కర్నూలు 25, నల్గొండ 46, నారాయణపేట 6, నిర్మల్ 13, నిజామాబాద్ 22, పెద్దపల్లి 21, రాజన్న సిరిసిల్ల 24, రంగారెడ్డి 66, సంగారెడ్డి 24, సిద్దిపేట 18, సూర్యాపేట 30, వికారాబాద్ 12, వనపర్తి 10, వరంగల్ రూరల్ 12, వరంగల్ అర్బన్ 44, యాదాద్రి భువనగిరి 18 కేసులు నమోదయ్యాయి.