ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ దూకుడు.. కేటీఆర్ ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు
: ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ సహా ముగ్గురిపై తెలంగాణ ఏసీబీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Formula E-Car Race Case
Formula E-Car Race Case: ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ సహా ముగ్గురిపై తెలంగాణ ఏసీబీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తుంది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదైంది. ముగ్గురుఫై 13(1)(A)13(2)PC ACt, 409, 120B IPC సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం నిధులు సుమారు 55 కోట్లు అక్రమంగా బదిలీ చేశారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు విచారణ జరపనున్నారు. ఇవాళ దాన కిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు నమోదు చేయనున్నారు. హెచ్ఎండీఏ కార్యాలయాల్లో ఫైల్స్ ను పరిశీలించనున్నారు. ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ దానకిశోర్ ఏసీబీకి అక్టోబరులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Also Read: Gossip Garage : కేటీఆర్ అరెస్ట్ జరిగితే కారు స్టీరింగ్ ఆ ఇద్దరిలో ఎవరికి..?
కేటీఆర్ ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలును పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులు 54 కోట్ల 88లక్షల 87వేల043 అక్రమంగా యూకేకి చెందిన ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ కంపెనీ బదిలీ చేశారు. రెండు విడతల్లో ఈ చెల్లింపు జరగ్గా.. మొదట విడత గతేడాది అక్టోబర్ 3న 22కోట్ల 69లక్షల 63వేల 125, అదేవిధంగా రెండో విడత గతేడాది అక్టోబర్ 11న 23కోట్ల 01 లక్షల 97వేల 500బదిలీ జరిగినట్లు తేల్చారు. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి నగదు బదిలీ జరిగింది. విదేశీ కంపెనీకి చెల్లింపులతో హెచ్ఎండీఏకు 8కోట్ల 6 లక్షల 75వేల 404 అదనపు పన్ను భారం పడింది. 10కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్థిక శాఖ అనుమతి అవసరం. సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్ కు స్పాన్సర్స్ లేకపోవడంతో హెచ్ఎండీకేకు నిధులు మళ్లించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్ నుండి ఎఫ్ఈఓ కంపెనీలకు నిధులు బదలాయింపు జరిగింది. తద్వారా.. హెచ్ఎండీఏకి చెందిన 54.88 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం చేశారు.
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెల్లింపులు జరిపారు. ఎలక్షన్ కమిషన్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ చెల్లింపులు చేశారు. చెల్లింపులు జరిపాక 2023 అక్టోబర్ 30న మరోసారి ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ, రాష్ట్రంలో అప్పటికే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. 2023 అక్టోబర్ 9 నుండి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. హెచ్ఎండీఏ నుండి చేసిన చెల్లింపులకు ఎలక్షన్ కమిషన్ నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి ఎలాంటి అనుమతి లేకుండానే ఎఫ్ఈఓకు 54.8 కోట్లు చెల్లించారు. ఈ అగ్రిమెంట్ తో హెచ్ఎండీఏకు ఎలాంటి సంబంధము లేకపోయినా హెచ్ఎండీఏ నిధులను వినియోగించారు. అగ్రిమెంట్ లేకుండానే హెచ్ఎండీఏ నిధులు వినియోగించారు. చెల్లింపులు చేశాక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఫారిన్ ఎక్స్చేంజ్ నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేసిపెట్టారు. అయితే, ఈ ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో ఐదు అంశాలకు సంబంధించిన అక్రమాలు జరిగినట్లు దాన కిషోర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.