హయత్ నగర్ కార్పొరేటర్‌ను కొట్టిన జనాలు

  • Published By: madhu ,Published On : October 18, 2020 / 12:39 PM IST
హయత్ నగర్ కార్పొరేటర్‌ను కొట్టిన జనాలు

Updated On : October 18, 2020 / 1:41 PM IST

Attack on Hayathnagar Corporator : హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డిపై స్థానికులు దాడికి పాల్పడడం కలకలం రేపింది. రంగనాయకులగుట్టలో నాలాలు కబ్జాకు గురవుతున్నాయని చెప్పినా పట్టించుకోలేదంటూ మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దీని కారణంగా..వరద నీరు ఇళ్లలోకి చేరిందని వెల్లడిస్తున్నారు.



ప్రజా సమస్యలు పట్టించుకోకుండా..నిర్లక్షం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు కూడా దాడి చేయడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఇతరులు ఆపే ప్రయత్నం చేసినా..స్థానికులు వినిపించుకోలేదు. కార్పొరేటర్ ను చుట్టుముట్టి..చేయి చేసుకున్నారు.



హైదరాబాద్ లో వరుణుడు ఎలాంటి బీభత్సం సృష్టించిందో తెలిసిందే. ఈ కారణంగా..వరద నీరు పోటెత్తింది. కాల్వలు, నాలాలో నీళ్లు సాఫీగా పోకుండా..ఇళ్లలోకి ప్రవేశించాయి. దీంతో ఇంట్లో ఉన్న నిత్యావసరసరుకులు పూర్తిగా తడిసిపోయాయి. ఇదే విధంగా హయత్ నగర్ లో ఓ కాలనీలోకి నీళ్లు ప్రవేశించాయి.



నాలాలు, కాల్వలు కబ్జా చేయడంతోనే ఇదంతా జరిగిందని, పట్టించుకోవాలని చెప్పినా వినిపించుకోలేదంటున్నారు స్థానికులు. కాలనీకి వచ్చిన కార్పొరేటర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వారిని శాంతింప చేసే ప్రయత్నం చేస్తున్నారు.