సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్..!

ఇప్పటివరకు ఉన్న ప్రాసిక్యూటర్ కేసు దర్యాఫ్తును కొనసాగిస్తారని కూడా వెల్లడించింది.

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్..!

Updated On : September 20, 2024 / 4:35 PM IST

Cm Revanth Redddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసును బదిలీ చేయాలన్న పిటిషన్ పై విచారణను ముగించింది సుప్రీంకోర్టు. విచారణ కోసం కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. విచారణను సీఎం రేవంత్ ప్రభావితం చేస్తారన్నది అపోహ తప్ప ఆధారాలు ఏమాత్రం లేవని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.

అయితే, ఈ కేసు దర్యాఫ్తు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. కేసుని విచారిస్తున్న ఏసీబీ.. సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్టు చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. ఇప్పటివరకు ఉన్న ప్రాసిక్యూటర్ కేసు దర్యాఫ్తును కొనసాగిస్తారని కూడా వెల్లడించింది.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఏ-1గా ఉన్నారు. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీఫెన్ సన్ కి డబ్బు ఇస్తూ ఏసీబీకి దొరికిపోయారు. ఈ కేసుకి సంబంధించి ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నారు. హోంమంత్రిగా కూడా ఆయనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్న ఏసీబీ నేరుగా హోంమంత్రికే అంటే రేవంత్ రెడ్డికే రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఇందులో ఇన్ క్లూడ్ అయ్యారు.

ఈ కేసుని జసిస్ట్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం విచారించింది. ఈ కేసు విచారణను ముగించింది. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కేసు దర్యాఫ్తును రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తారన్నది అపోహ మాత్రమే, ఎటువంటి ఆధారాలు లేవు, అపోహలతో మేము కేసు ఇన్వెస్టిగేషన్ ని మరో రాష్ట్రానికి బదిలీ చేయలేము అని కోర్టు వ్యాఖ్యానించింది. జగదీశ్ రెడ్డి పిటిషన్ ను మేము ఎంటర్ టైన్ చేయలేము అంటూ కేసు విచారణను ముగించింది సుప్రీంకోర్టు.

అయితే, రేవంత్ రెడ్డికి కొన్ని ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఈ కేసు దర్యాఫ్తులో జోక్యం చేసుకోకూడదని రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు సూచనలు ఇచ్చింది. అలాగే ఏసీబీ కూడా ఈ కేసుకి సంబంధించి ఎటువంటి వివరాలను కూడా హోంమంత్రిగా అలాగే సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి నివేదించవద్దని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఉన్న ప్రాసిక్యూటరే కేసు విచారణను కొనసాగిస్తారని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే, ఏసీబీ కూడా స్పెషల్ ప్రాసిక్యూటర్ కు సహకరించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో ఈ ఓటుకు నోటు కేసు విచారణను పర్యవేక్షణ జరపాలని జగదీశ్ రెడ్డి తరుపు న్యాయవాది సుందరం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని కూడా అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

Also Read : రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును కాంగ్రెస్ నేతలు కూడా వ్యతిరేకించారా? కారణం అదేనా..