కిషన్ రెడ్డికి మాతృవియోగం

బీజేపీ సీనియర్ లీడర్,మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అండాలమ్మ (80) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి ఆమె పరిస్థితి విషమించింది. దీంతో డాక్టర్లు ఆమెకు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. అండాలమ్మ మృతితో కిషన్ రెడ్డి కుటుంబంలో విషాదం అలముకుంది.అండాలమ్మ మృతిపట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురులో ఈరోజు(ఏప్రిల్-25,2019) మధ్యాహ్నం 3 గంటలకు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.