అల్లు అర్జున్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదు.. ఆయన బయటకు వచ్చాకే అదుపులోకి తీసుకున్నాం: డీసీపీ
కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా అల్లు అర్జున్‌కు సమయం ఇచ్చామని అన్నారు.

అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన వేళ జరిగిన పరిణామాలపై సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ పలు వివరాలు తెలిపారు. బన్నీ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా అల్లు అర్జున్‌కు సమయం ఇచ్చామని అన్నారు. అల్లు అర్జున్ ఇంట్లో నుంచి బయటకు వచ్చాకే ఆయనను అరెస్టు చేశామని తెలిపారు. అల్లు అర్జున్ స్వయంగా వచ్చి పోలీసు కారులో కూర్చున్నారని ఆయన అన్నారు.
కాగా, అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ విడుదల కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ సమయం వరకు ఆన్‌లైలో హైకోర్టు ఆర్డర్ కాపీ ఆప్‌లోడ్ కాలేదు.
చంచల్ గూడా జైల్ కు న్యాయవాదులు వచ్చారు. రూ.50 వేల రెండు పర్సనల్ బాండ్స్ సిద్ధం చేశారు. ఆర్డర్ కాపీ కోసం ఎదురుచూస్తున్నారు. జైల్ వద్ద భారీగా పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు.
గతంలో సల్మాన్, సంజయ్ దత్ వంటి అనేక మంది కూడా అరెస్ట్ అయ్యారు: బన్నీ అరెస్టుపై రేవంత్ రెడ్డి