Chai ATM : టీ ప్రియులకు గుడ్ న్యూస్.. చాయ్ ఏటీఎం 24 గంటలు.. ఎక్కడంటే?
టీ తాగని వారు చాలా తక్కువమంది ఉంటారు. డే లో ఖచ్చితంగా ఏదో టైంలో టీ తాగుతారు. టీ ప్రియుల కోసం ఇప్పుడు ఏటీఎంలు కూడా వెలుస్తున్నాయి. అవును.. ఎక్కడంటే?

Chai ATM
Chai ATM : ఉదయం నిద్ర లేచాక టీ లేదా కాఫీ తాగకపోతే చాలామందికి డే మొదలుకాదు. ఇండియాలో 64 శాతం మంది టీ తాగేందుకే ఇష్టపడుతున్నారట. అలాంటి చాయ్ లవర్స్ ముఖ్యంగా హైదరాబాదీలకు గుడ్ న్యూస్. ఇప్పుడు చాయ్ ఏటీఎంలు వెలుస్తున్నాయి. వివరాలు చదవండి.
Stop Drinking Tea : ఉదయాన్నే టీ తాగడం మానేయండి ! ఎందుకో తెలుసు ?
చాయ్ ప్రేమికులు చాలామంది ఉంటారు. డే మొత్తంలో చాయ్ తాగని వారు ఉండరు. బయటకు వెళ్తే కూడా చాయ్ తాగడానికి ఇష్టపడేవారు ఉంటారు. అలాంటి వారి కోసం హైదరాబాద్‌లో చాయ్ ఏటీఎం వెలిసింది. ఎల్బీనగర్‌లోని ఎల్.పి.టి మార్కెట్ దగ్గర వెలిసిన ఈ చాయ్ ఏటీఎం ఇప్పడు అందర్నీ ఆకట్టుకుంటోంది.
Black Tea : బ్లాక్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా ?
ఈ చాయ్ ఏటీఎం 24/7 అందుబాటులో ఉంటుంది. ఇక్కడ స్కాన్ చేయగానే చాయ్ గ్లాసులో పడిపోతుంది. అంతేనా? లెమన్ టీ, బాదాం టీ, కాఫీ, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ ఏవైనా సరే జస్ట్ స్కాన్ చేస్తే చాలు చేతిలోకి వచ్చేస్తాయి. సోషల్ మీడియాలో ఈ చాయ్ ఏటీఎం వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ ఏరియాలో ఆల్రెడీ ఉన్నవారు.. ఆ ఏరియావైపు వెళ్తున్నవారు మరీ ముఖ్యంగా టీ లవర్స్ ఓ సారి ఈ ఏటీఎంని సందర్శించండి. ఇక్కడి చాయ్ చాలా టేస్టీగా ఉందని రుచి చూసిన వారు చెబుతున్నారు.
View this post on Instagram