హైదరాబాద్ నుంచే బీజేపీపై యుద్ధం ప్రారంభం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 110 సీట్లతో మనదే విజయం

kcr ghmc elections: టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం తీరుపైనా, రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారంపైనా కేసీఆర్ సీరియస్ అయ్యారు. డిసెంబర్ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో కాంక్లేవ్ నిర్వహించబోతున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, దేవెగౌడ, అఖిలేష్ యాదవ్.. తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. బీజేపీపై హైదరాబాద్ నుంచే యుద్ధం మొదలు పెడ్తున్నట్టు ఆయన ప్రకటించారు. 20 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం చూస్తోందని కేసీఆర్ ఆరోపించారు.
https://10tv.in/election-commission-orders-to-stop-flood-relief-assistance/
కేంద్ర ప్రభుత్వ పథకాలు, వైఫల్యాలపై ప్రజల్లోఅవగాహన కల్పించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ అన్నారు. GHMC ఎన్నికల్లో 110 సీట్లు గెలవబోతున్నట్టు పార్టీ శ్రేణులకు వెల్లడించారు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నట్టు కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్‌ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నారు. మరి కాసేపట్లో అభ్యర్థులను ప్రకటించబోతున్నట్టు చెప్పారు.