KCR Tejashwi Yadav : టార్గెట్ బీజేపీ.. సీఎం కేసీఆర్‌తో తేజస్వి యాదవ్ కీలక భేటీ, దేశ రాజకీయాలపై చర్చ

ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో మంగళవారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం విధానాలు సహా పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు.

KCR Tejashwi Yadav : టార్గెట్ బీజేపీ.. సీఎం కేసీఆర్‌తో తేజస్వి యాదవ్ కీలక భేటీ, దేశ రాజకీయాలపై చర్చ

Kcr Tejashwi Yadav

Updated On : January 11, 2022 / 7:19 PM IST

KCR Tejashwi Yadav : బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో మంగళవారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం విధానాలు సహా పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు. తేజస్వి యాదవ్ తో పాటు మాజీ మంత్రి అబ్దుల్ బారి సిద్దిఖీ, మాజీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

కేంద్రంలో బీజేపీ పాలసీ, విద్యుత్ సవరణ చట్టం, రైతు వ్యతిరేక విధానాలపై తేజస్వి యాదవ్.. సీఎం కేసీఆర్ తో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, బీజేపీ వ్యతిరేక పార్టీలతో కేసీఆర్ వరుసగా సమావేశం అవుతున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, వామపక్ష నేతలతోనూ కేసీఆర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Chandrababu : చిరంజీవి పార్టీ పెట్టకుంటే.. అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లం..! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

బీజేపీ విచ్చిన్నకర, అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన తక్షణ అవసరం ఉందనే అభిప్రాయం కేసీఆర్, తేజస్వి యాదవ్ భేటీ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా రైతులు సహా సమస్త వర్గాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న బీజేపీని గద్దె దించే వరకు పోరాడాల్సిన అవసరం ఉందని తేజస్వి యాదవ్ అన్నారు. దానికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణను త్వరలో నిర్ణయించుకోవాలని ఇరువురూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

భేటీ సందర్భంగా బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జెడీ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చిన విషయాన్ని లాలూ గుర్తు చేసినట్టు సమాచారం. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు ముందుకు రావాలంటూ సీఎం కేసీఆర్ ను లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

”మీరు తెలంగాణ కోసం ఎంతో పోరాడారు. త్యాగం చేశారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. నేడు దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారు. అన్ని మతాలను కులాలను వర్గాలను సమానంగా చూస్తూ సాగుతున్న మీ పాలనానుభవం దేశానికి అవసరం ఉంది. జాతీయ రాజకీయాల్లో మీరు తగిన పాత్ర పోషించాలి. లౌకిక ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఆరాచక పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకు లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాలి. దేశాన్ని నాశనం కానివ్వద్దు. అందుకు మీరు ముందుకు రావాలి” అని లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం కేసీఆర్ ను కోరినట్టు సమాచారం.

రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ గురించి, సాగునీటి రంగాభివృద్ధి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై తేజస్వి యాదవ్ సీఎం కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. దేశ సమగ్రతను కాపాడే దిశగా జాతీయ రాజకీయాలను బలోపేతం చేయాలని, అందుకోసం సాగే బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి సాగుతామని ఆర్జెడీ నేతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.

Turmeric : పసుపు తీసుకునే విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే?

ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపైనా వీరు ఇరువరూ చర్చించారు. రానున్న యూపీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ కే తమ మద్దతిస్తున్నట్టు సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ ప్రకటించడం గొప్ప పరిణామమని వారు చర్చించినట్టు సమాచారం. లౌకిక వాద ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఆర్జెడీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తేజస్వి యాదవ్ బృందం స్పష్టం చేసినట్టు సమాచారం.