కరోనాపై ఆందోళన అవసరం లేదు : సీఎం కేసీఆర్

కరోనా వైరస్ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. తప్పుడు ప్రచారం వెనుక కుట్ర ఉందన్నారు. సోమవారం (జూన్ 8, 2020) కరోనా పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

కరోనాపై ఆందోళన అవసరం లేదు : సీఎం కేసీఆర్

Cm Kcr Review Meeting Coron

Updated On : December 6, 2021 / 1:18 PM IST

కరోనా వైరస్ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. తప్పుడు ప్రచారం వెనుక కుట్ర ఉందన్నారు. సోమవారం (జూన్ 8, 2020) కరోనా పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వాస్పత్రులకు ఉందని పేర్కొన్నారు. కరోనా సోకిన వారికి చికిత్స అందించడానికి.. అన్ని రకాల సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

2 వేల మందికి చికిత్స అందించే సామర్థ్యం గాంధీ ఆస్పత్రికి ఉందన్నారు. ఇప్పుడు 247 మంది కరోనా పేషంట్లు మాత్రమే గాంధీ ఆస్పత్రిలో ఉన్నారని వెల్లడించారు. గాంధీలో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు వెయ్యి ఉన్నాయని వెల్లడించారు. గాంధీలో కరోనా రోగులతో కిక్కిరిసిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఏ కారణంతో చనిపోయినా కరోనా పరీక్షలు చేయాలనడం సరికదన్నారు. కరోనా విషయంలో వాస్తవ పరిస్థితికి జరుగుతున్న ప్రచారానికి పొంతన లేదన్నారు. 9.61 లక్షల పీపీఈ కిట్లు, 14 లక్షల ఎన్ -95 మాస్కులున్నాయని తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కరోనా విధుల్లో ఉన్న వారికి వైరస్ సోకడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోందన్నారు.

ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మందికి కరోనా వైరస్ సోకిందని తెలిపారు. ఐపీఎంఆర్ ప్రకారం దేశంలో 10 వేల మంది వైద్య సిబ్బందికి కరోనా సోకిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 153 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకిందని..వైరస్ సోకిన వైద్య సిబ్బందిలో ఎవరికీ విషమంగా లేదన్నారు. కరోనాపై ఆందోళన అవసరం లేదు అంతా సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు.

కరోనా సోకిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం కరోనా బారిన పడి సీరియస్ ఉన్నవారికి ఆస్పత్రుల్లో.. లక్షణాలు లేని వారికి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. హైకోర్టు ఆదేశంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లాలని వైద్యాధికారులు, నిపుణులు సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు.