CM KCR : భయాందోళనలకు గురికావొద్దు, ఇళ్లలోనే పండుగ జరుపుకోవాలి-సీఎం కేసీఆర్

ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని, స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని సీఎం స్పష్టం చేశారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం..

CM KCR : భయాందోళనలకు గురికావొద్దు, ఇళ్లలోనే పండుగ జరుపుకోవాలి-సీఎం కేసీఆర్

Cm Kcr Corona

Updated On : January 9, 2022 / 11:25 PM IST

CM KCR : కరోనా పట్ల భయాందోళనలకు గురికావొద్దని ప్రజలకు సూచించారు తెలంగాణ సీఎం కేసీఆర్. అయితే, ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని, స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని సీఎం స్పష్టం చేశారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం వంటి స్వీయ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారు అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని చెప్పారు.

Lemon Water : మోతాదుకు మించి నిమ్మరం తీసుకుంటున్నారా?.. అయితే జాగ్రత్త!..

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మరోసారి కరోనా ఉధృతమవుతుండడం పట్ల అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితులు సహా కరోనా పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్దంగా ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.

అదే సమయంలో సంక్రాంతి పండుగ వస్తోందని, ప్రజలు గుమికూడవద్దని, ఇళ్లలోనే పండుగ చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు (15 నుంచి 18 సంవత్సరాలు) కరోనా వ్యాక్సిన్ వేయించాలని పిలుపునిచ్చారు. సోమవారం నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లు, 60ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోసు (మూడో డోసు) ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నా కేసీఆర్.

Coffee Tea : కాఫీ తాగటం మంచిదా?..టీ తాగటం మంచిదా?

కాగా, తెలంగాణలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 48,583 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,673 మందికి పాజిటివ్‌‌గా తేలింది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,94,030కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొవిడ్ కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 4,042కి చేరుకుంది. కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజు 330 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 13,522 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.