టీపీసీసీ అధ్యక్షుడిగా 38 నెలలపాటు పోరాడాను: రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన ఆయనకు శుభాభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. 

టీపీసీసీ అధ్యక్షుడిగా 38 నెలలపాటు పోరాడాను: రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

Updated On : September 15, 2024 / 5:04 PM IST

Cm Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడిగా 38 నెలలపాటు ప్రజల తరఫున పోరాడానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంతో నమ్మకంతో మహేశ్‌ కుమార్‌కు కీలక బాధ్యతలు ఇచ్చిందని తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన ఆయనకు శుభాభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుసటిరోజే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించామని చెప్పారు. ఆర్టీసీలో మహిళలు ఇప్పటివరకు 85 కోట్ల ప్రయాణాలు చేశారని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ.10 లక్షలు పెంచామని చెప్పారు.

తమ మీదికొస్తే ఒళ్లు చింతపండు అవుతుందని బీఆర్‌ఎస్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌. ‘వాళ్లొస్తామన్నారు. మనమే వాళ్లింటికి పోయినం. మా మీదికొస్తే చింతపండైతది. మహేశ్‌ కుమార్‌ వెనుక నేనున్నా’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఏమన్నారో తెలుసా?