కేటీఆర్‌కు చెక్‌? రేవంత్‌ మాటల్లోని ఆంతర్యమేంటి?

అంతా ఫినిష్ అయ్యాక మిగిలేది హరీష్‌ రావు మాత్రమేనని.. ఆయన్ని ఎలా డీల్ చేయాలో తెలుసని రేవంత్ అన్నారు. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమేనని.. రాజకీయ వర్గాలు చెబుతున్నాయ్‌.

కేటీఆర్‌కు చెక్‌? రేవంత్‌ మాటల్లోని ఆంతర్యమేంటి?

KTR and Revanth Reddy

Updated On : October 31, 2024 / 3:10 PM IST

కొడుతుతో తండ్రిని ఫినిష్ చేశా.. ఇప్పుడు బావతో బామ్మర్దిని ఫినిష్‌ చేస్తా.. మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌ మాట్లాడిన మాటలివి. ఇంతకీ ఆయన ఏం చేశారు.. ఏం చేయబోతున్నారు.. ఎలా చేయబోతున్నారు.. రేవంత్ మాటలకు అర్థం ఏంటి.. కేటీఆర్‌ను ఎలా ఫినిష్ చేస్తారు.. అసలీ ఫినిషింగ్ రాజకీయాలు ఎక్కడికి దారి తీయబోతున్నాయ్‌.. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది…

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ టార్గెట్‌గా.. సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాలను మరింత మండిస్తున్నాయ్. మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో కేసీఆర్ ఫ్యామిలీపైరేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ఏడాదిలో కొడుకుతో తండ్రిని ఫినిష్ చేశానని… మరో ఏడాదిలో రాష్ట్రంలో అసలు కేసీఆర్ ఊసే లేకుండా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పుడు బావతో బామ్మర్దిని ఫినిష్ చేస్తానని బాంబు పేల్చారు? అంటే హరీష్‌ రావుతో.. కేటీఆర్‌ను ఫినిష్ చేస్తానని చెప్పారన్నమాట. ఇక ఆ తర్వాత మిగిలేది కేవలం హరీష్‌ రావు మాత్రమేనని.. ఆయనను ఎలా డీల్ చేయాలో తనకు తెలుసంటూ.. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు పాలిటిక్స్‌లో కొత్త చర్చకు కారణం అవుతోంది. ఇప్పటికే భగ్గుమంటున్న రాజకీయం.. ఈ ఫినిషింగ్‌ టచ్‌తో ఇంకెంత మండుతుందో అనే చర్చ నడుస్తోంది.

అందుకే అన్నారా?
ఫినిష్ చేశాను.. ఫినిష్ చేస్తా అంటూ సీఎం రేవంత్ మాటలకు అర్థమేంటన్న చర్చ తెలంగాణలో జరుగుతోంది. కేటీఆర్‌తో కేసీఆర్‌ను ఫినిష్ చేశానని.. అసలు రేవంత్ ఎందుకు అన్నారు.. ఏం చేశారు.. ఆయన మాటల్లో ఆంతర్యమేంటని ఆరా తీస్తున్నారరు. తెలంగాణలో రెండు దఫాలు అధికారం చేపట్టిన పార్టీగా జనాల్లో వ్యతిరేకత రావడం.. అదే సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు జనాలు ఆకర్షితులు కావడంతో.. బీఆర్ఎస్‌ ఓడిపోయింది.

మరి ఈ మాత్రం దానికి కేటీఆర్‌తో కేసీఆర్‌ను ఫినిష్‌ చేయించిందేంటి.. అసలేం చేశారు అనే డౌట్‌లు చాలామందిలో తెగవస్తున్నాయట. కేసీఆర్‌ మౌనం వెనక కాంగ్రెస్‌ వ్యూహం కానీ.. రేవంత్‌ ప్లాన్‌ కానీ ఉందా అంటే.. అదీ లేకపాయె ! ఓడిపోతే ఫాంహౌస్‌కు పోతా ఎన్నికల ప్రచారంలోనే చెప్పిన కేసీఆర్‌.. ఎన్నికల్లో ఓడగానే అదే పనిచేశారు. ఇందులో కాంగ్రెస్, రేవంత్ చేసిందేంటి.. మధ్యలో కేటీఆర్‌ ఎందుకు వచ్చారు అని.. ఆలోచనలో పడిపోయారు చాలాంది.

ఏడాదిలో రాష్ట్రంలో కేసీఆర్‌ ఊసే లేకుండా చేస్తానన్న రేవంత్ మాటల వెనక వేరే అర్థం ఉందనే చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి మొదలు.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరుగుతుండగా.. అందులో కచ్చితంగా కేసీఆర్ జైలుకెళ్లాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు. ఆయన జైలుకెళ్తే.. ఇక ఆయన పేరు కనుమరుగైపోతుందని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బావతో అంటే హరీష్‌తో బామ్మర్ధిని అంటే కేటీఆర్‌ ఫినిష్‌ చేస్తానని రేవంత్ అన్నారు.

కాంగ్రెస్ నేతల ఆరోపణ ఏంటి?
దీని అర్థాన్ని డీకోడ్‌ చేసే పనిలో ఉన్నారు మరికొందరు. ఈ మాటల వెనక భారీ ఆంతర్యం ఉందంటున్నాయ్ రాజకీయవర్గాలు. ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలు.. కార్ రేసింగ్, ధరణి వంటి కేసుల్లో కేటీఆర్ భారీఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఆ అంశాలపై విచారణ తుది దశకు చేరుకుందని.. కేటీఆర్‌పై త్వరలోనే కేసులు నమోదవుతాయని.. ఆ తర్వాత అరెస్ట్ అయి జైలుకు వెళ్తారని హస్తం పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే.. కేటీఆర్‌ను ఫినిష్‌ చేస్తానని రేవంత్ చెప్పి ఉంటారన్న చర్చ జరుగుతోంది. మరి ఇందులో బావ హరీష్ పాత్ర ఏముంది.. బావతో బామ్మర్ది ఫినిషి అని రేవంత్‌ ఎందుకు అన్నారో.. ఎవరికీ అర్థం కావడం లేదట.

అంతా ఫినిష్ అయ్యాక మిగిలేది హరీష్‌ రావు మాత్రమేనని.. ఆయన్ని ఎలా డీల్ చేయాలో తెలుసని రేవంత్ అన్నారు. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమేనని.. రాజకీయ వర్గాలు చెప్తున్నాయ్‌. ఇక్కడే రేవంత్ చాలా తెలివిగా పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు.. అవినీతి ఆరోపణల్లో కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్తే.. బీఆర్ఎస్‌కు హరీష్ రావే నాయకత్వం వహించనున్నారని ఊహిస్తున్నారు. ఆయనను తమ దారికి తెచ్చుకోవడం పెద్ద విషయం కాదని.. సీఎం రేవంత్ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా.. తెలంగాణలో ఫినిషింగ్ రాజకీయాలు ఎక్కడి దారితాస్తాయన్న ఉత్కంఠ సామాన్యల్లో కనిపిస్తోంది.

వివాదాలతో వైసీపీలో కలకలం.. ఫ్యామిలీ పాలిటిక్స్‌.. పార్టీని దెబ్బతీస్తున్నాయా?