Cm Revanth Reddy : జీతం తీసుకుని పని చేయని వ్యక్తి కేసీఆర్, కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ?- సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించిన పన్నులు ఎన్ని? తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని?

Cm Revanth Reddy : జీతభత్యాలు తీసుకుని పని చేయని వ్యక్తి కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పదేళ్ల పాలనలో అప్పులు, తప్పులు తప్ప కేసీఆర్ మరేమీ చేయలేదని రేవంత్ అన్నారు. అప్పుల విషయంలో కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపారని, కేసీఆర్ చేసిన అప్పుల రిపోర్ట్ ను అసెంబ్లీలో బయటపెడతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. అధికార పక్షం కంటే ప్రతిపక్షాలకే అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడే అవకాశం ఇస్తున్నామన్నారు.
కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. నేరాలు చేసే వ్యక్తులు భయపడరని అన్నారు. జీతం తీసుకుని కూడా పని చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఏ చిన్న అంశం జరిగినా రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, అలా చేయడం కేసీఆర్ కుటుంబానికే చెల్లిందని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. కేంద ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డిని సవాల్ చేశారు. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించిన పన్నులు ఎన్ని? తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని? అని ప్రశ్నించారు. తేదీ, సమయం చెప్పండి.. చర్చకు మేము సిద్ధం అన్నారు రేవంత్.
కేసీఆర్ బాధపడతారనే కిషన్ రెడ్డి సహకరించడం లేదని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కిషన్ రెడ్డి ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కనిపిస్తోంది, మరి కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులు ముందుకు వెళ్లకుండా బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు రేవంత్. మూసీ పునరుజ్జీవానికి నిధులు తీసుకొస్తే కిషన్ రెడ్డిని సన్మానిస్తానిన అన్నారు.
Also Read : నా జీవితంలో మర్చిపోలేని అవకాశం, కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం జరుగుతుంది- అద్దంకి దయాకర్