Ambulance Overturn : అంబులెన్స్ బోల్తా పడి డ్రైవర్ మృతి.. చికిత్స పొందిన రోగిని ఇంటివద్ద వదిలి వస్తుండగా ప్రమాదం
అయితే అందులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో అంబులెన్స్ ధ్వంసమైంది. దీంతో అతడు మృతి చెందాడు. సమాచారం అందదిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Road Accident (12)
Driver Died : హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ చౌరస్తాలో ఓ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. అంబులెన్స్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం నుంచి వస్తున్న అంబులెన్స్ బీఎన్ రెడ్డి చౌరస్తాలో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన అంబులెన్స్ డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
అయితే అందులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో అంబులెన్స్ ధ్వంసమైంది. దీంతో అతడు మృతి చెందాడు. సమాచారం అందదిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని మహేశ్ గా గుర్తించారు.
కాగా, మలక్ పేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగిని ఇంటివద్ద వదిలి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడం, ఇతర వాహనాలు కూడా లేనందున పెను ప్రమాదం తప్పింది.