EATALA: గ్రామాల్లో ఈటల పాదయాత్ర.. రేపటి నుంచి ప్రారంభం
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రేపు(18 జులై 2021) 9.30 గంటలకు కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుండి ఈటల రాజేందర్ పాదయాత్ర మొదలు కాబోతుంది.

Eatala
EATALA: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రేపు(18 జులై 2021) 9.30 గంటలకు కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుండి ఈటల రాజేందర్ పాదయాత్ర మొదలు కాబోతుంది.
బత్తినివానీపల్లిలో ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఈటల పాదయాత్ర ప్రారంభం కానుంది. శనిగరం, మాదన్న పేట, గునిపర్తి , శ్రీరాముల పేట, అంబలలో పాదయాత్ర సాగనుంది.
రేపు రాత్రి అంబాలలో బస చేసి తర్వాతి రోజు మళ్లీ పాదయాత్ర కొనసాగిస్తారు. 23రోజుల పాటు ఈటల పాదయాత్ర కొనసాగుతుంది. 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల మేర ఈటల పాదయాత్ర చేయనున్నారు ఈటల.