Harish Rao Exclusive: బీఆర్ఎస్‎లో నెంబర్ 2 వార్ జరుగుతోందా..? వెళ్లిన వారు తిరిగొస్తామంటే మళ్లీ పార్టీలోకి తీసుకుంటారా?

పార్టీ అన్నాక ఒక వ్యూహం ఉంటుంది. మేమందరం పని చేస్తున్నాం అంటే ఆయన డైరెక్షన్ లోనే. ఒక ఆలోచనతో, ఒక వ్యూహంతో పని చేస్తున్నాం.

Harish Rao Exclusive: బీఆర్ఎస్‎లో నెంబర్ 2 వార్ జరుగుతోందా..? వెళ్లిన వారు తిరిగొస్తామంటే మళ్లీ పార్టీలోకి తీసుకుంటారా?

Updated On : April 26, 2025 / 10:40 PM IST

Harish Rao Exclusive: బీఆర్ఎస్ లో నెంబర్ వార్ జరుగుతోందా? పార్టీలో సెకండ్ పొజిషన్ కోసం పోటీ ఉందా? డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నియామకం ఎందుకు జరగలేదు? హరీశ్ రావును పక్కన పెట్టారా? వరంగల్ సభకు ఎందుకు దూరంగా ఉన్నారు? దీనికి మాజీ మంత్రి హరీశ్ రావు ఇచ్చిన సమాధానం ఏంటి.. 10 టీవీ ఎక్స్ క్లూజివ్ విత్ హరీశ్ రావు.. ”పాతికేళ్ల గులాబీ”..

ప్రశ్న: కేసీఆర్ చాలా రోజులుగా అసెంబ్లీకి రావటం లేదు. రమ్మని వాళ్లు పిలుస్తున్నా రావటం లేదు. పెద్దగా మాట్లాడటం కూడా లేదు. ఫ్లోర్ లీడర్ గా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉంటే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నియామకం కూడా చేసుకోలేదు. పైగా హరీశ్ రావును కొంత సైడ్ చేశారు, పక్కన పెట్టారు అనే టాక్ వినిపిస్తోంది.

వరంగల్ సభకు కూడా మీరు దూరంగా ఉన్నట్లే కనిపిస్తోంది. కవిత, కేటీఆర్ అక్కడే ఉంటున్నారు. మీరు పెద్దగా కనిపించడం లేదు. ట్రబుల్స్ వచ్చినప్పుడే హరీశ్ రావుని ముందు పెడుతున్నారు. మిగిలిన సమయాల్లో పెద్దగా పట్టించుకోరు. దీనికి మీరు ఏమంటారు? కేసీఆర్ తర్వాత పార్టీలో సెకండ్ పొజిషన్ కోసం పోటీ ఉందా?

Also Read: ఎంపీగా ఓడిన కవితకు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు? కుటుంబపాలన విమర్శలను ఎలా చూస్తారు?

హరీశ్ రావు..
”అలాంటిదేమీ లేదు. అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దు. రేటింగ్స్ కోసం కొంతమంది నా గురించి ఏవేవో రాస్తుంటారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే. ఐ గో బై పార్టీ, ఐ గో బై మై లీడర్. మా నాయకుడు ఏం చెబితే అదే చేస్తాను, పార్టీ ఏం నిర్ణయిస్తే అదే చేస్తాను.

కేసీఆర్ బయటకు ఎందుకు రారు, కచ్చితంగా వస్తారు. పార్టీ అన్నాక ఒక వ్యూహం ఉంటుంది. మేమందరం పని చేస్తున్నాం అంటే ఆయన డైరెక్షన్ లోనే. ఒక ఆలోచనతో, ఒక వ్యూహంతో పని చేస్తున్నాం. రాకపోతే రాలేదు అంటారు, వస్తేనేమో ఊరికే వెంటపడతాడని అంటారు. ప్రజల పక్షం, ప్రజల కోసం, తెలంగాణ మేలు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ప్రజల మేలు కోసం ముందుకెళ్తాం.

Also Read: సిల్వర్ జూబ్లీ సభ వేదికగా గులాబీ గూటికి ఈ నేతలు తిరిగి వస్తున్నారా!?

కేసీఆర్ తర్వాత నెంబర్ 2 కోసం పోటీ అనే ముచ్చట లేదు. దాని గురించి ఎలాంటి డిస్కషన్ లేదు. మా అందరి లక్ష్యం ఒక్కటే. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. అందరం కలిసి కేసీఆర్ నాయకత్వంలో, డైరెక్షన్ లో పని చేస్తాం. మళ్లీ మా ప్రభుత్వం రావాలి. కేసీఆర్ సీఎం కావాలి. పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలే తిరిగి పార్టీలోకి వస్తామంటే తీసుకునే పరిస్థితి లేదు. పోయిన 10 మందే ఎందుకు పోయామని బాధపడుతున్నారు. ప్రజలు తీవ్ర ఆగ్రహం ఉన్న విషయాన్ని వారు గ్రహించారు. వెళ్లిపోయిన ఎమ్మెల్యేలలో చాలామంది తిరిగి మా దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ దే అంతిమ నిర్ణయం” అని హరీశ్ రావు తేల్చి చెప్పారు.

 

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here