Formula E Car Race Case : కేటీఆర్ విజ్ఞప్తికి ఈడీ ఆమోదం..
ఈ కార్ రేస్ కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ కేటీఆర్ కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

BRS Working President KTR
Formula E Car Race Case : మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తికి ఈడీ ఆమోదం తెలిపింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మంగళవారం ఈడీ విచారణకు హాజరు కాలేనని, తనకు మరింత సమయం ఇవ్వాలని కోరారు కేటీఆర్. మంగళవారం కోర్టు తీర్పు ఉన్నందున విచారణకు రాలేనని చెప్పారు. దీనిపై స్పందించిన ఈడీ.. కేటీఆర్ విజ్ఞప్తికి ఓకే చెప్పింది. తదుపరి విచారణ తేదీని త్వరలో తెలియజేస్తామంది.
ఈ కార్ రేస్ కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ కేటీఆర్ కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే, తాను మంగళవారం విచారణకు రాలేనని.. ఈడీకి మెయిల్ పెట్టారు కేటీఆర్. ఈ మెయిల్ కు ఈడీ రిప్లయ్ ఇచ్చింది. మంగళవారం క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం విచారణకు రాలేనని మెయిల్ లో పేర్కొన్నారు కేటీఆర్.
సోమవారం ఏసీబీ విచారణకు సంబంధించి కేటీఆర్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు. అయితే, న్యాయవాదులను కేటీఆర్ తో పాటు లోపలికి వెళ్లేందుకు ఏసీబీ అధికారులు అనుమతించకపోవడంతో కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది.
Also Read : కేటీఆర్ ఏసీబీ విచారణ రోజు హైడ్రామా.. విచారణకు సహకరించలేదంటూ అరెస్ట్ చేస్తారా?