Harish Rao: కృష్ణా జలాలపై రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు కౌంటర్‌

తెలంగాణలో ప్రాజెక్టులను కాంగ్రెస్ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్పగించిందని హరీశ్ రావు చెప్పారు. కేసీఆర్ ఏనాడూ కూడా అప్పగించలేదని అన్నారు.

Harish Rao: కృష్ణా జలాలపై రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు కౌంటర్‌

Harish Rao

కృష్ణా జలాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన కామెంట్లకు మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్‌ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో హరీశ్ రావు ఓ సమావేశంలో మాట్లాడుతూ… కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ప్రాజెక్టుల అప్పగింత వల్ల హైదరాబాద్‌కు అన్యాయం జరుగుతుందని చెప్పారు.

తెలంగాణలో ప్రాజెక్టులను కాంగ్రెస్ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్పగించిందని హరీశ్ రావు చెప్పారు. కేసీఆర్ ఏనాడూ కూడా అప్పగించలేదని అన్నారు. అప్పనంగా ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకి అప్పగించి వచ్చింది కాంగ్రెసేనని తెలిపారు. విషయం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నారని అన్నారు.

కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెట్టిందని హరీశ్ రావు తెలిపారు. జైపాల్ రెడ్డి, జైరాం రమేశ్ ఇద్దరు బిల్లు తీసుకొచ్చారని అన్నారు. రేవంత్ రెడ్డి అతి తెలివి బంద్ చెయ్యాలని వ్యాఖ్యానించారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్పగించటం వల్ల హైదరాబద్ తాగు నీళ్లు, ఖమ్మం, నల్లగొండకు సాగు నీరు రావటం కష్టమని చెప్పారు.

పోతిరెడ్డుపాడు కోసం టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదని హరీశ్ రావు అన్నారు. కరెంట్ కోతలు మొదలయ్యాయని, కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయిందని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని అన్నారు. ఇప్పటి ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ యెన్నో అబద్ధాలు ఆడి, అడ్డగోలు హామీలిచ్చిందని అన్నారు. పెన్షన్లు, రైతు బంధు ఇప్పటి దాకా ఇవ్వలేదని చెప్పారు.

హరీశ్ రావు కామెంట్స్..

  • ఇప్పుడు పింఛను 4 వేలు కాదు 2వేలకే దిక్కులేదు
  • రైతుబంధు 15 వేలన్నారు..ఇప్పటికీ లేదు
  • రుణమాఫీ మరచేపోయారు
  • బాండ్ పేపర్ ఇచ్చి మోసం చేశారు
  • కరెంట్‌ బిల్లులన్నీ సోనియాకు పంపుదాం
  • అసెంబ్లీలో మా ప్రశ్నలకు నోరిప్పితే ఒట్టు
  • ఆరు గ్యారెంటీలు కాంగ్రెసుతో కావు
  • ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఓట్లు అడుగు
  • ఆటో కార్మికుల పొట్ట కొట్టారు
  • కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయింది

ఆ అసెంబ్లీ స్థానం నుంచే మళ్లీ పోటీ చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్